ఆంధ్రప్రదేశ్‌

విజయసాయిరెడ్డిపై డీజీపీకి రాయపాటి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: విద్యేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని నరసరావుపేట టీడీపీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు డిమాండు చేశారు. ఈమేరకు ఆయన గురువారం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులను కించపరిచేలా విజయసాయిరెడ్డి వాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందేలా పని చేసే అధికారులను అవమానపరిచేలా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఫిర్యాదులో కోరారు.