ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం సహకరిస్తే మరింత అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఫిబ్రవరి 22: కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి ఉంటే మరింత అభివృద్ధి చెంది ఉండేవారమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్మితమవుతున్న కియ కార్ల ఫ్యాక్టరీ రూపకల్పన ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడారు. కేంద్రం పూర్తిగా తమకు సహకరించకపోయినప్పటికీ రేయింబవళ్లు కష్టపడి దావోస్, సింగపూర్, నార్వే తదితర దేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేసినట్లు చెప్పారు. అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు. జిల్లాకు సమీపంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై, విశాఖపట్నం కారిడార్, బెంగళూరు, అమరావతి కారిడార్ ఉండటం వల్ల మార్కెటింగ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుందని సీఎం చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు పెద్దఎత్తున తరలి వస్తున్నారన్నారు. ఔత్సాహికులు ముందుకు వస్తే అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తగినంత భూమి, నీరు, విద్యుత్, మ్యాన్‌పవర్ పుష్కలంగా ఉన్నాయన్నారు. సోలార్, విండ్ ద్వారా 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం వల్ల పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లాకు త్వరలో ఎనర్జీ యూనివర్శిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చేందుకు కేంద్రంతో పోరాటం చేయనున్నట్లు తెలిపారు. హీరో మోటార్స్ వంటి పరిశ్రమలు పనులు ప్రారంభించలేకపోతున్నాయని, వాటిని త్వరలో పరిశీలిస్తామన్నారు. తన ఆత్మవిశ్వాసం, పట్టుదల వల్ల పట్టిసీమను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. హంద్రీనీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకురావడం వల్ల అనంతపురం జిల్లాకు 60 నుండి 70 దాకా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. హంద్రీనీవా ద్వారా హిందూపురం, మడకశిర, పేరూరు ప్రాంతాలకు నీరు అందిస్తామన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు, విద్యాసంస్థలు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్, సైన్స్ సిటీ వంటి పరిశ్రమలకు కేటాయించిన భూములపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాయలసీమలో ఇప్పటికే ఈసూజీ, అపోలో, వీర వాహన, అమర్‌రాజా బ్యాటరీ వంటి ఎన్నో పరిశ్రమలు ప్రారంభమైనట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ పాల్గొన్నారు.
సీఎం సభలో లాయర్ల నిరసన!
హిందూపురం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అనంతపురం జిల్లా పెనుకొండలో కియ కార్ల ఫ్యాక్టరీ భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు నినాదాలు చేశారు. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. అరవకండి...వచ్చి చెప్పండి వింటా....ఇలా నలుగురైదుగురి తీరు వల్లే అనవసరంగా రాద్ధాంతం చోటు చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నా....పుట్టపర్తి విమానాశ్రయం నుండి మీ సమస్యలను చెప్పమని సూచించా...అయినా ఇక్కడికొచ్చి వేలాది మంది ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సబబని అన్నారు. తమ్ముళ్లూ....చప్పట్లు కొట్టి వారిని నినాదాలు చేయకుండా చూడండి అంటూ సభకు హాజరైన వారిని ఉద్దేశించి సీఎం అన్నారు. ఇందుకు పెద్ద ఎత్తున చప్పట్లు చరచడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో రాష్ట్భ్రావృద్ధికి అడ్డుకొంటోందని, ఎవరు ఏంచేసినా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు మేలు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.

చిత్రం..పెనుకొండ మండలంలోని ఎర్రమంచి గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు