ఆంధ్రప్రదేశ్‌

జనగణమనకు వందేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 23: విశ్వకవి రవీంద్రుడి కలం నుంచి జాలువారిన జనగణమన భారతీయ స్ఫూర్తిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అపురూప గీతం. భరతమాత ముద్దుబిడ్డ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ గీతం ఖండాంతరాల్లో భారతీయతను చాటిచెప్పింది. జాతీయోద్యమకాలంలో ప్రజల్లో చైతన్యదీప్తులను వెలిగించిన గీతమిది. ఈ గీతం ఆలపిస్తున్నా, ఆలకిస్తున్నా భారతీయుడి మనసు పరవసిస్తుంది. భారతీయతకు నిలువెత్తు రూపమైన మన జాతీయగీతం జనగణమనకు 2011 డిసెంబరు 27కు వందేళ్లు పూర్తయింది. అయితే ఈ గీతాన్ని విశ్వకవి రవీంద్రుడు బెంగాలీ భాషలో రచించి 1911 డిసెంబరు 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించారు. అవిభక్త ఆంధ్రరాష్ట్రం మదనపల్లెలో హోమ్‌రూల్స్ వ్యవస్థాపకురాలు అనీబీసెంట్ స్థాపించిన బీసెంట్ థియోసాఫికల్ (బీటీ) కళాశాల విద్యార్థులతో కలిసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1919లో నేషనల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న విశ్వకవి రవీంధ్రనాధ్ ఠాగూర్ బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా బీటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ కజిన్స్ బెంగళూరుకు వెళ్లి ఠాగూర్‌ను తమ కళాశాలకు ఆహ్వానించారు. 1919 ఫిబ్రవరి 24న మదనపల్లెకు వచ్చిన రవీంద్రుడు ఇక్కడి వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడే ఆరురోజుల పాటు గడిపారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు సంగీత పోటీల్లో దేశభక్తి గీతాలకు స్పందించిన రవీంద్రుడు వారిని ఉత్తేజపరచడానికి బెంగాలీ భాషలో ఉన్న ‘జనగణమన’ను ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా (్భరతదేశ సుప్రభాతం) పేరిట ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. జాతీయగీతాన్ని బీటీ కళాశాలలోని అప్పటి విద్యార్థులచే ఆంగ్లంలోకి అనువదించి డాక్టర్ కజిన్స్ అందించిన ట్యూన్స్‌తో జనగణమన ఆలపించారు. ఆరోజు నుంచి వరుసగా మూడురోజులు పాటు జాతీయగీతం ఆలపించారు. జాతీయగీతం వినిపించగానే ప్రతి భారతీయుడు అప్రమత్తమై ఎక్కడ ఎలాఉన్నా తగు గౌరవాన్ని ఇస్తారు. జాతి ఔన్నత్యాన్ని మననం చేసుకుంటూ నిటారుగా నిలబడి పదంతో పదం కలిసి దేశభక్తిని చాటుతాడు. ఉత్తేజాన్ని ప్రసరించే జాతీయగీతం వినిపించగానే శిరస్సు వంచి వందనం చేస్తారు. విశ్వకవి రవీంద్రుడు జనగణమన గీతాన్ని 31చరణాలతో పూరించగా, అందులో ఏడు చరణాలతో మనం జాతీయగీతంగా ఆలపిస్తున్నాము. రచన సంస్కృత మిళిత బెంగాలీ భాష అయినా, భారతీయులంతా దీనిని తమ మాతృగీతంగా అనుభూతి చెంది పాడుకునేలా మన జాతీయగీతం రూపుదిద్దుకుంది. భారతీయులను దృష్టిలో ఉంచుకుని భగవంతుని మాత్రమే జనగణమనలో కీర్తించాలని ఆయన పేర్కొన్నారు. ‘జనగణమన’ను 1950 జనవరి 24న జాతీయగీతంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో భారతీయ రిపబ్లిక్‌కు తొలి రాష్టప్రతిగా డాక్టర్ బాబురాజేంద్రప్రసాద్ ఎన్నికైన రోజునే జనగణమనను జాతీయగీతంగా ప్రకటించారు.
విశ్వకవికి 156ఏళ్ళు.. జనగణమనకు వందేళ్లు
విశ్వకవి రవీంద్రుడికి 156 వసంతాలు. ఆయన కలం నుంచి జాలువారిన జనగణమన గీతానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 24నుంచి 28 వరకు మదనపల్లెలో భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బీటీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిధులుగా ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమరనాధరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా నాయకులు, మేధావులు, విద్యార్థులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

chitram...
విశ్వకవి రవీంద్రుడు జనగణమన గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జూమా చేసింది ఈ గదిలోనే