ఆంధ్రప్రదేశ్‌

సీమపై అంత ప్రేముంటే ప్యాకేజీ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/అమరావతి/అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 24:, విభజన హామీలపై గళమెత్తిన టీడీపీ నేతలు, ప్రతిపక్ష వైకాపాపై నిప్పులు చెరిగారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీరును తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు కేటాయించక పోగా రాయలసీమను ఉద్ధరిస్తామని ప్రాంతీయత తత్వాలను రెచ్చకొట్టటం మూర్ఖత్వమని విమర్శించారు. శనివారం గుంటూరులో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని కొత్త పల్లవిని అందుకోవటం హేయమన్నారు. దక్షిణాదిలో రెండో రాజధాని డిమాండ్‌ను ఎందుకు ఆమోదించరని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా ఉండి ప్రాంతీయ తత్వాలను రెచ్చకొట్టటం తగదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు మూడేళ్లలో కేవలం 1050 కోట్లు మాత్రమే విదిల్చారని విమర్శించారు. టీడీపీ పుణ్యంతో ఎమ్మెల్సీ పదవి దక్కిన సోము వీర్రాజు అజ్ఞానంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నిందారోపణలు చేస్తున్నారని, అబద్ధపు ప్రచారం మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఏపీకి వేలకోట్లు నిధులిచ్చారనటం అవాస్తవ ప్రచారమన్నారు. పల్నాడు బ్రహ్మనాయుడు వారసులమైన తమతో పెట్టుకోవద్దని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, ప్రజల ప్రయోజనాల విషయంలో తాము రాజీపడబోమని మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మార్చి 5 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. విభజన నేపథ్యంలో నాడు పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని ప్రకటన చేశారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై మాట్లాడుతూ ఇది తమ పరిధిలో లేదని సీఎం తెలిపారని, బెంచ్ ఏర్పాటు విషయం పరిశీలనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఐఏఎస్‌లపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, అవినీతి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విపక్ష నాయకుడు జగన్ రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారని మంత్రి శిద్దా రాఘవరావు ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రం కేంద్రంగా నిర్వహించిన అవినీతి కార్యకలాపాల వల్ల జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోవడానికి జగన్ కారకుడయ్యారని దుయ్యబట్టారు. జగన్ అవినీతి చర్యల వల్ల ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా సిగ్గుతో తలదించుకునే దుస్థితి కల్పించారని ధ్వజమెత్తారు. ఇందూటెక్ జోన్ పెట్టుబడుల వ్యవహారంలో మారిషస్ ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీకి, నలుగురు కేంద్ర మంత్రులకు లీగల్ నోటీసులు పంపించిందన్నారు.
కాగా నరేంద్ర మోదీ గుజరాత్‌కో న్యాయం, ఏపీకి మరో న్యాయం అమలు చేయడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ప్రశ్నించారు శనివారం విజయవాడలో విలేఖరుల సమావేశంలో మట్లాడుతూ విభజన చట్టం సెక్షన్-46లో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ ఖండ్, కేబీకే తరహాలో ఇస్తామని చెప్పి విస్మరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలోని నాలుగు జిల్లాలకు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు రూ.23,500 కోట్లు అవసరమని కేంద్రానికి పంపిస్తే కేవలం రూ.1,050 కోట్లను ముష్టిగా పడేశారన్నారు. ఇది కూడా విభజన చట్టంలో సెక్షన్-46 ప్రకారం కాకుండా దేశంలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన విధంగానే రాష్ట్రానికి ఇచ్చారన్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బాబు సీమలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరబోతున్నారని, ఉప ప్రాంతీయ వాదాలను రెచ్చగొడితే ప్రజలు సహించరని హెచ్చరించారు.