ఆంధ్రప్రదేశ్‌

చెక్‌బౌన్స్ కేసులో ఇద్దరు టీచర్ల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 24: చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఇద్దరు టీచర్లను రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆ టీచర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దాసేగానూరు జడ్పీ హైస్కూల్‌లో తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న దొరస్వామిరాజు, గంగవరం మండలం మేలుమాయి హైస్కూల్‌లో బయాలజీ టీచర్ కళానందరెడ్డి ఉపాధ్యాయులుగా ఉంటూ ఇతర ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీరు ఇతరులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వీరిపై కోర్టులో కేసులు దాఖలు అయ్యాయి. ఈనేపథ్యంలో చెక్‌బౌన్స్ కేసులో వీరిరువురికి కోర్టు రిమాండ్ విధించింది. దీనితో ఉపాధ్యాయులుగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వీరిరువురిని సస్పెండ్ చేసినట్లు డి ఇ ఒ తెలిపారు.