ఆంధ్రప్రదేశ్‌

సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, ఫిబ్రవరి 24: ఆంధ్ర, కర్నాటక సరిహద్దు గ్రామాల పరిధిలోని పలు గ్రామాల్లో నాలుగు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజులుగా గజ రాజులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ కాలం నెట్టుకొస్తున్నారు. శుక్రవారం శాంతీపురం మండల పరిధిలోని 121-పెద్దూరు గ్రామం చెరువులో నాలుగు ఏనుగులు ఒక రోజు చెరువులోనే గడిపాయి. తాజాగా శనివారం మండల పరిధిలోని బెల్లకోగిల సమీపాన వున్న తిమ్మయ్యకుంట వద్ద మకాం వేసి వున్న ఏనుగులను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. చుట్టు చేరిన జనం అరుపులు, కేకలకు భీతిల్లిన ఏనుగులు ఓ వైపున ఉన్న నీలగిరి తోటలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. ఈ సందర్భంలో జనంపై దూసుకొచ్చాయి. కర్నాటక వాసి కిట్టప్పపై దాడికి పాల్పడ్డాయి. అక్కడున్న జనం అతనిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన కిట్టప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కర్నాటక రాష్ట్రం జకార్సకుప్పంకు గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కర్నాటక, రాళ్లబూదుగూరు పోలీసులు జనాన్ని హెచ్చరించి చెల్లాచెదురుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే ఇంకా తోటల్లోనే మకాం వేసిన ఏనుగులు ఏ గ్రామం వైపునకు వచ్చి ఎవరిని పొట్టన పెట్టుకుంటాయోనన్న భయాందోళనతో స్థానికులు ఉన్నారు. మారుమూల గ్రామాల్లో మకాం వేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.