ఆంధ్రప్రదేశ్‌

గంటకో మాట..రోజుకో తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 24: తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అర్హతను బట్టి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు కో విధంగా మాట్లాడుతున్నారని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని అచ్చం ఊసరవెల్లిగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాలుగేళ్ళ పాలన చూశారు , ఆయన మోసాలు, అబద్దాలు చూశారు, అన్యాయమైన పాలన కూడా చేశారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని అవినీతి జరుగుతున్న విధానాన్ని కూడా చూశారని జగన్ తెలిపారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మందు పిల్లలు మద్యం వలన చెడిపోతున్నారని అందువలన అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు, మద్యం విక్రయాల నియంత్రణ చేస్తానని చెప్పారని, కాని ప్రస్తుతం గ్రామాల్లో మంచినీరు దొరకక పోయినా మద్యం మాత్రం దొరుకుతోందన్నారు.
చివరికి ఫోన్ చేసినా మద్యాన్ని హోం డెలివరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పన్నుల ఎక్కువగా ఉండడం వల్ల పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు కరెంట్ బిల్లుల గురించి మాట్లాడే చంద్రబాబు అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తానన్నాడు కాని అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలు తగ్గించక పోగా మూడు సార్లు చార్జీలు పెంచారని తెలిపారు. ఆర్టీసీ చార్జీలు కూడా మూరు సార్లు పెంచారని విమర్శించారు. గతంలో రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, పామాయిల్, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు, పసుపు, చింతపండు, కిరోసిన్ వంటి తొమ్మిది రకాల సరుకులు దొరికేవని, అన్నీ చక్కగా ప్యాకింగ్ చేసి కేవలం 185 రూపాయలకే ఇచ్చేవారని, కాని నేడు రేషన్ షాపుల్లో బియ్యం తప్పా మరేదీ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఎన్నికలకు ముందు రైతుల రుణాల 87 వేల 612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఈ నాలుగు సంవత్సరాల్లో రుణమాఫీ చేయక పోవడం వలన బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం బయటకు రాక పోగా ఆభరణాలు వేలం వేస్తున్నట్లు నోటీసులు వస్తున్నాయన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో విచ్చల విడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతికి చక్రవర్తి అయిన చంద్రబాబు అవినీతిపై క్లాసులు పీకుతాడని ధ్వజమెత్తారు. నిజానికి అసెంబ్లీకి పోయేందుకు కూడా మనసు రావడం లేదని ఆ విధంగా సభలు నడుపుతున్నారని, చట్టాలు రూపొందించే సభలను అవహేళన చేస్తున్నారని, పార్టీలు మారిన వారిని అనర్హులుగా చేయడం లేదని ధ్వజమెత్తారు. పైగా వారిలో కొంత మందికి మంత్రి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇలాంటి పాలన ఎక్కడైనా చూశామా అని ఆయన ప్రశ్నించారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, కనిగిరి వైకాపా ఇన్‌చార్జి బొర్రా మధు సూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి