ఆంధ్రప్రదేశ్‌

సీమ న్యాయవాదులతో చర్చలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ గత నెల రోజులుగా రాయలసీమలో ఐక్యంగా ఆందోళనలు చేస్తున్న న్యాయవాదులతో తక్షణం సంప్రదింపులు జరపాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బహిరంగ లేఖ రాశారు. న్యాయవాదులకు మద్దతుగా యువతీ, యువకులు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారన్నారు. వీరి సమస్యను పరిష్కరించకపోగా ఈనెల 22న తమ పర్యటన సందర్భంగా రాయలసీమ జిల్లాలన్నింటిలోనూ న్యాయవాదులు, ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులతో వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని మధు డిమాండ్ చేశారు.