ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ సేవలో నాగ సాధువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఫిబ్రవరి 24: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మను శనివారం ఉదయం హిమాలయాల నుండి వచ్చిన నాగ సాధువులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని కోటి లింగాల పుణ్య క్షేత్రం అవరణలో ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఈ నాగ సాధువులు శనివారం అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చారు. అమ్మవారి రాజగోపురం వద్ద వీరికి ఆలయ సహాయ ఈవో శ్రవణం అచ్యుత రామయ్యనాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వీరికి ఆలయ కమిటీ చైర్మన్ వై గౌరంగబాబు అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఈ సందర్భంగా నాగసాధువులు మాట్లాడుతూ ఆదివారం కోటి లింగాల క్షేత్రంలో జరిగే కార్యక్రమం పాల్గొటానికి విచ్చేశామన్నారు. దైవ కార్యక్రమం జరిగే స్థలాన్ని శుద్ధి చేసేందుకు ఆ కార్యక్రమ నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు హిమలయాల నుండి వచ్చామన్నారు.

చిత్రం..దుర్గమ్మ సన్నిధిలో నాగసాధువులు