ఆంధ్రప్రదేశ్‌

పోరాడితేనే ప్రత్యేక హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగుబ్బ, ఫిబ్రవరి 25 : పోరాడితే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీ వరకూ గడువు ఇస్తున్నామని, అంతలోపు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ‘హోదా గర్జన’ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని మండల కేంద్రమైన ముదిగుబ్బలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రను రఘువీరా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సొంత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై నాటకం ఆడుతున్నాయన్నారు. ‘ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మిన్న’ అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీడీపీపై వ్యతిరేకత ఎక్కువ అవడంతో ఇప్పుడు తిరిగి ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ కేంద్ర ప్రభుత్వం ముందు గంగిరెద్దులా తల ఊపుతూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కిందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అబద్ధపు హామీలకు ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కుల, మతాల చిచ్చు పెడుతూ బీజేపీ బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్నికలకు మందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నూకలు చెల్లే కాలం ఆసన్నమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు రాహుల్‌గాంధీ ప్రధానిగా మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపైనే చేయిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.