ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా జనగణమన ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 25: భారతదేశ చరిత్రపుటలలో లిఖించదగిన దేశభక్తి గేయం ‘జనగణమన’ను ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా జాతీయగీతాన్ని ఆంగ్లంలో తర్జూమా చేసి తొలిసారి ఆలపించిన దినోత్సవాన్ని ఆదివారం చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం బిటి కళాశాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని బిటి కళాశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు చేపట్టిన ర్యాలీని కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ళ విజయభాస్కర్‌చౌదరి, బీజేపీ జాతీయ నేత చల్లపల్లె నరసింహారెడ్డి ప్రారంభించారు. ర్యాలీ బెంగళూరు రోడ్డు సర్కిల్‌లోని డాక్టర్ అనిబిసెంట్ విగ్రహం వరకు సాగింది. అక్కడ అనిబిసెంట్‌కు నివాళి అర్పించిన అనంతరం, ర్యాలీగా బిటి కళాశాల ఆవరణలోని విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ బస చేసిన ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఠాగూర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అనిబిసెంట్ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో కరస్పాండెంట్ విజయభాస్కర్‌చౌదరి మాట్లాడారు. మదనపల్లె పరిసర ప్రాంతాలోని పంట పొలాలు, బాహుదా సెలయేరుల వాతావరణానికి ముగ్ధుడైన విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ ఏడు రోజుల పాటు మదనపల్లె బిటి కళాశాలలో బస చేశారని గుర్తుచేశారు. వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఏడాది పొడవునా ప్రతినెలా 28వ తేదిన జనగణమన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి హాజరవుతున్నట్లు తెలిపారు. నాడు విశ్వకవి ఆలపించిన జనగణమన జాతీయగేయం నేడు వందేళ్ల ఉత్సవాలు జరుపుకోవడం మనందరి అదృష్టమన్నారు. అనంతరం బిటి కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు చల్లపల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ మదనపల్లె ప్రాంతానికి వచ్చి బెంగాలీ భాషలో ఉన్న జనగణమన గీతాన్ని మూడుసార్లు ఆలపించి, అనంతరం ఆంగ్లంలోకి తర్జూమా చేసి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో పట్ట్భద్రురాలైన మార్గరెట్ కజిన్స్ తన పియానోపై రాగాన్ని ట్యూన్ కూర్చారన్నారు. 1919 ఫిబ్రవరి 27న అదే రాగాన్ని రవీంద్రనాధ్‌ఠాగూర్ విద్యార్థులతో పాడించారని, ఫిబ్రవరి 28న రవీంద్రుడు జాతీయగీతాన్ని అదే నిడివి, అదే రాగంతో బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి తర్జూమా చేసి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జయపాల్, జిలాకు చెందిన మేధావులు, పూర్వవిద్యార్థులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
చిత్రం.. మదనపల్లెలో విశ్వకవి రవీంద్రుడి చిత్రపటాన్ని ప్రదర్శిస్తున్న
బిటి కళాశాల యాజమాన్యం, పూర్వవిద్యార్థులు