ఆంధ్రప్రదేశ్‌

టెక్స్‌టైల్స్, అపెరల్ పరిశ్రమల స్థాపనకు.. ఏపీ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్‌లో టెక్స్‌టైల్స్, అపెరల్ పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలున్నాయని, ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆదివారం టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్స్‌పై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన టెక్స్‌టైల్ విధానంలో నూలు స్పిన్నింగ్ యూనిట్లతో పాటు వీవింగ్, దుస్తుల ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సదుపాయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాల్సిందిగా కోరారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లీజింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ సంస్థ సీఈఓ ఆర్‌సీఎం రెడ్డి ఫెసిలిటేటర్‌గా వ్యవహరించారు. టెక్స్‌టైల్స్ రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు ఎపీలో టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ పార్కుల విస్తరణకు వౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ప్రోత్సాహాలు, విధానపరమైన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎల్ గ్రూపు కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నూతన టెక్స్‌టైల్స్ విధానంలో కొత్తగా వచ్చే పరిశ్రమలతో పాటు ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల కంటే ఏపీ విధానాలు ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. ఐఏసీసీ ప్రతినిధి, తిరుపూర్ గార్మెంట్స్ అధినేత ఏ శక్తివేల్ మాట్లాడుతూ తిరుపూర్ పట్టణంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తాము విజయాలను సాధించగలిగామన్నారు. బలమైన అసోసియేషన్లు ఉంటే ప్రభుత్వ సహకారంతో ఎంతో సాధించగలమన్నారు. టోరె ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ షెగికజు సునేగా హెజీన్ అండ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరితో పాటు మోహన్ స్పిన్‌టెక్స్ చైర్మన్ సుధాకర్, లైఫ్‌స్టైల్ ఫ్యాబ్రిక్స్ అరవింద్ లిమిటెడ్ సీఈఓ అమీర్ అక్తర్, షాహీ ఎక్స్‌పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ తిరుమూర్తి గంగాధర్ ఏపీలో టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్స్ పరిశ్రమ విస్తృతికి గల అవకాశాలపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై టెక్స్‌టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహికులతో ఎంవోయూలు కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25 మంది పారిశ్రామిక వేత్తలు రూ.5,137 కోట్లతో యూనిట్లు స్థాపించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా 32,442 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
చిత్రం..టెక్స్‌టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహికులతో ఎంవోయూలు కుదుర్చుకుంటున్న వారితో సీఎం చంద్రబాబు