ఆంధ్రప్రదేశ్‌

పాలకుల విధానాలపై పోరాటాలు: సురవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాతంత్ర భావసారూప్యత గల పార్టీలతో వర్గ ద్వేష పోరాటాలు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు జరిగే సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి నిర్మాణ విస్తృత స్థాయి సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందుగా సి పి ఐ రాష్టక్రార్యదర్శి వర్గ సభ్యుడు హరినాథరెడ్డి పతాకావిష్కరణ చేశారు. తినడానికి తిండి, దున్నడానికి భూమి తప్ప పాలకులు అన్ని ఇస్తున్నారని వీటిపై సిద్ధాంత పరమైన పోరాటాలుసాగాలని సాగాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు తాను మెట్టెక్కడానికి ఏ పార్టీనైనా నిచ్చెనగా వాడుకుంటారని అన్నారు. సి పి ఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ కంట్రోలింగ్ ఛ్మైరన్ పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రామానాయుడు పాల్గొన్నారు.