ఆంధ్రప్రదేశ్‌

మెగా టూరిజం ప్రాజెక్టుగా కొండవీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 21: కొండవీడు కోట ప్రాంతాన్ని మెగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కొండవీడు కోట ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ, దేవాదాయ, పురావస్తు, రోడ్లు భవనాలు తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు కోట దిగువ నుండి పై వరకు నిర్మించనున్న ఘాట్‌రోడ్డును ఆగస్టు మాసాంతానికి పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. 2016 సంవత్సరం చివరలో కొండవీడు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు, కోట పైనున్న దేవాలయాల ఆధునీకరణ పనులకు సంబంధించిన నిధులు దేవాదాయ శాఖ కేటాయిస్తుందని, సంబంధిత పనులను వెంటనే పూర్తిచేయాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కొండవీడు ప్రాంతంలో ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి గాను ప్రభుత్వం కేటాయించిన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇస్కాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన పనులు, వెచ్చించిన నిధుల వివరాలు అందించాలని ప్రతినిధులకు సూచించారు. ఇక నుండి ప్రతినెలా కొండవీడు ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమావేశం జరుగుతుందని, వచ్చే నెలలో సంబంధిత శాఖల రాష్టస్థ్రాయి అధికారులతో సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. అటవీశాఖ క్లియరెన్స్ త్వరగా వచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, డిఆర్‌ఒ నాగబాబు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ జయరాజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.