ఆంధ్రప్రదేశ్‌

గుంతకల్ రైల్వే జోన్‌పై హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఆంధ్ర రాష్ట్రంలోని గుంతకల్‌లో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ అంశంపై కేంద్రప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తమ వైఖరిని తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది. గుంతకల్‌కు చెందిన కె శ్రీనివాస చౌదరి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్లు 93, 94 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తున్నాయని, కాని, కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదంటూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫున డబ్ల్యు.బి. శ్రీనివాస్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ, విభజన చట్టం ప్రకారం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆరు నెలల్లోగా రైల్వే జోన్ ఏర్పాటుపై సాధ్యా సాధ్యాల నివేదికను కేంద్రం తెప్పించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే మూడు సంవత్సరాలు గడచిందని, కేంద్రం, రైల్వే శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా ఈ విషయమై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, జాప్యమెందుకని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.