ఆంధ్రప్రదేశ్‌

‘ఓటుకు నోటు’ కేసుకు భయపడి హోదా తాకట్టు పెట్టలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 13: ఓటుకు నోటు కేసుకు భయపడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ప్రత్యేక హోదాకోసం నేడు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈమేరకు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ ప్రతులను ముద్రగడ మంగళవారం ఇక్కడ పత్రికలకు విడుదల చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి హైదరాబాద్ వదిలి వచ్చేశారని విమర్శించారు. ఇదే కేసు విషయంలో ప్రధాని మోదీకి ప్రత్యేక హోదాను అమ్మేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేయలేదా? అని ప్రశ్నించారు. ఇంత చేసి ఇంకా డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
గిమ్మిక్కులతో ప్రజలను నమ్మబలికి, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ రోడ్డెక్కినట్టు చెబుతున్నారు కదా? మరి కాపుల కోసం మీరిచ్చిన హామీలను అమలుచేయాలని తాము డిమాండ్ చేసినపుడు ఈ విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. గత నాలుగేళ్ల పాలనలో ఏనాడూ నిజం మాట్లాడలేదని చంద్రబాబును విమర్శించారు. కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీని అమలుచేయమని ప్రశ్నించినందుకు అణగదొక్కుతున్నారని, ఇదే సమయంలో తన సొంత సామాజికవర్గానికి చెందిన ఎంతోమందికి ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతున్నారని విమర్శించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం మంజూరు చేసిన నిధులు ఏ విధంగా ఖర్చు చేశారో వివరాలు చెప్పలేని దుస్థితిలో చంద్రబాబున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం, అమరావతి పనులకు సంబంధించి అధికంగా అంచనాలు వేయించి, నిధుల కైంకర్యానికి పాల్పడిన మీరు నేడు ప్రత్యేక హోదాకోసం సాగిస్తున్న పోరాటం తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ముద్రగడ లేఖలో వ్యాఖ్యానించారు.