ఆంధ్రప్రదేశ్‌

ఆగని మారణహోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 13: ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. కోల్పోయింది మళ్లీ సాధించాలి’.. అలాగే ‘ దెబ్బకు దెబ్బ తీయాలి’ ఇది మావోయిస్టుల పట్టుదల. భద్రతా బలగాల వ్యూహాల నుంచి తప్పించుకోవడం, ఒకసారి గాయమైతే మళ్లీ పైకి లేవడం, ఆ గాయానికి మందుగా ప్రతీకారం తీర్చుకోవడం.. ఉనికి కోసం అనేక పాట్లు పడి సమాంతర పాలన సాగించే దాకా అంచలంచెలుగా ఎదిగిన మావోయిస్టులు పడుతూ లేస్తూ ఎప్పటికప్పుడు తమ పట్టు నిలుపుకునేందు చేస్తున్న ప్రయత్నాల్లో దండకారణ్యంలో మారణహోమం ఆగటం లేదు. దశాబ్దకాలంగా ఇది ఆరని కాష్టంలా రగులుతూనే ఉంది. చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్టల్రోని గడ్చిరోలిలో.. పశ్చిమబెంగాల్, బీహార్‌లోని ఝార్ఖండ్‌లో.. ఇలా తమ ప్రాబల్య ప్రాంతాల్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు సాగిస్తున్న మెరుపుదాడుల్లో అనేకమంది జవాన్లు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోవలోనిదే మంగళవారం చత్తీస్‌గఢ్‌లో జరిగిన మందుపాతర ఘటన. దశాబ్ద కాలం నుంచి మావోయిస్టులు జరిపిన దాడుల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
* 2017 ఏప్రిల్ 24న చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మాటువేసి దాడి చేసి 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చారు. చింతల్‌నార్- చింతగుప్ప ప్రాంతంలో రహదారి పనులకు రక్షణగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉండగా అదునుచూసి సుమారు 300 మంది మావోయిస్టులు విరుచుకుపడి కాల్పులు జరిపారు.
* 2017 మార్చి 12న చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడిలో 12 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అసువులు బాశారు.
* 2013 మే 25న చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, సల్వాజుడుం నేత మహేంద్ర కర్మ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది నేతలను హతమార్చారు.
* 2010 జూన్ 29న చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 26 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
* 2010 ఏప్రిల్ 6న దేశంలోనే అతిపెద్ద సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్టు సీఆర్‌పీఎఫ్‌కు తీరని నష్టాన్ని మిగిల్చారు. చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 75 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్నారు. భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన అతి పెద్ద దాడి ఇది.
* 2010 ఫిబ్రవరి 15న పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో ఈఎఫ్‌ఆర్ క్యాంపుపై దాడి చేసిన మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 24 మంది ఈఎఫ్‌ఆర్ జవాన్లు మృతి చెందారు.
* 2010 మే 8న చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 8మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మట్టుబెట్టారు.
* 2010 ఏప్రిల్ 4న ఒడిషాలో జరిపిన దాడిలో నక్సల్స్ నిరోధక ప్రత్యేక ఆపరేషన్స్ బృందానికి చెందిన 11మంది అసువులు బాశారు.
* 2009 అక్టోబర్ 8న మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాలో ఒక పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన మావోయిస్టులు 17 మంది పోలీసుల ప్రాణాలు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.
* 2009 జూన్ 16న బీహార్‌లో మందుపాతర పేల్చడంతో 11మంది పోలీసులు బలయ్యారు. అదే ఏడాది జూలై 27న చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మందుపాతర పేల్చి ఆరుగురి ప్రాణాలను మావోయిస్టులు బలిగొన్నారు.
* 2009 మే 22న గడ్చిరోలీలో మావోయిస్టులు జరిపిన దాడిలో 16 మంది పోలీసులు మరణించారు.
* 2009 ఏప్రిల్ 13న ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో బాక్సైట్ గని వద్ద 10 మంది పారామిలటరీ సిబ్బందిని మావోయిస్టులు హతమార్చారు.
* 2008 జూలై 16న ఒడిషాలోని మల్కనగిరి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వ్యాన్‌ను మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేశారు. ఈ దాడిలో 21 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
* 2008 జూన్ 29న ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్‌లో బోటుపై గ్రేహౌండ్స్ కమాండోలు వెళ్తున్న క్రమంలో రాకెట్ లాంఛర్‌తో దాడి చేవారు. ఈ దాడిలో లాంచీ డ్రైవర్‌తో పాటు 38 మంది మరణించారు.మంగళవారం నాటి మందుపాతర పేలుడు ధాటికి ధ్వంసమైన మైన్ ప్రొటెక్టెడ్ వాహనం