ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: ప్రతిపక్ష వైకాపా సభ్యులు ప్రస్తుత శాసనసభ సమావేశాలకు పూర్తిగా బహిష్కరిస్తున్నప్పటికీ ప్రతి రోజు జరిగే ప్రశ్నోత్తరాల్లో ఆ పార్టీ సభ్యులు ముందుగానే సంధించిన ప్రశ్నల్లో కొన్ని టీడీపీ, బీజేపీల మధ్య మరింత చిచ్చురేపుతున్నాయి.
తాజాగా వైకాపా సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి 2014-15 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఏ మేర నిధులు కేటాయించింది తెలియపర్చాలంటూ వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్థిక సంవత్సరాల వారిగా అందించిన వివరాలు బుధవారం సభలో ప్రకంపనలు సృష్టించాయి. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం అలాగే పరిహారం కింద, ప్రత్యేక సహాయం కింద కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద నిధులు వస్తున్నాయని యనమల తెలిపారు. ప్రధానంగా కేంద్ర పన్నుల్లో వాటా, ఏకీకృత వస్తు సేవల పన్ను, వస్తు సేవల నష్ట పరిహారం పన్ను, ఆర్థిక సంఘం గ్రాట్లు, స్థానిక సంస్థలకు ఎఫ్‌సీ గ్రాంటు, ప్రకృతి వైపరీత్యాల రాష్ట్ర నిర్దిష్ట అవసరాలు, రెవెన్యూ లోటు గ్రాంటు, ఇతర గ్రాంట్లు ఈఏపీ గ్రాంట్లు, జీఎస్‌టీ పరిహారం, రెవెన్యూ లోటు గ్రాంటు, రాజధాని నగరానికి గ్రాంట్లు, విజయవాడలో వరదనీటి మురుగు పారుదల పథకం, గుంటూరులో యుజీడీ గ్రాంటు, ఏడు వెనుకబడిన జిల్లాలు, గోదావరి పుష్కరాలు, కేంద్ర సహాయ రాష్ట్ర ప్రణాళిక పథకాలు, పోలవరం ఇలా పలు రకాల పద్దుల కింద 2014-15లో రూ. 37,326 కోట్లు, 2015-16లో రూ. 43,564 కోట్లు, 2016-17లో రూ. 49,845 కోట్లు, 2017-18లో ఇప్పటి వరకు రూ. 49,137 కోట్ల ఆర్థిక సహాయం అందినదని తెలిపారు. దీనిపై బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు ఒక్కసారిగా లేచి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంత భారీగా నిధులందిస్తున్నా కేంద్రానికి ధన్యవాదాలు చెప్పాల్సిందిపోయి నయాపైసా ఇవ్వడంలేదంటూ కేంద్రాన్ని అసత్య ప్రచారాలతో ఆడిపోసుకోవటం సరికాదంటుండగా తేదే సభ్యులు ముక్కుమ్మడి నిరసన తెలుపుతూ అడ్డుపడ్డారు.