రాష్ట్రీయం

బాబు, ముగ్గురు మంత్రులపై వైకాపా ప్రివిలేజ్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా వైకాపా సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులను శాసనసభ కమిటీకి అందచేసింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె అచ్చెంనాయుడు, కామినేని శ్రీనివాస్‌పై ఈ నోటీసులను అందచేశారు. మార్చి 9వ తేదీన ప్రతిపక్ష నేత జగన్‌కు వ్యతిరేకంగా అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగించినందుకు రూల్ 162 కింద ఈ నోటీసులను అందించినట్లు వైకాపా పేర్కొంది. కామినేని శ్రీనివాస్ మార్చి 9న, దేవినేని ఉమామహేశ్వరరావు మార్చి 14న అన్‌పార్లమెంటరీ పదాలను తమ నేతను ఉద్దేశించి ఉపయోగించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు వైకాపా తెలిపింది.