రాష్ట్రీయం

ఐఐటి జెఇఇలో తెలుగు విద్యార్థుల విజయఢంకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: దేశవ్యాప్తంగా 92 అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐఐటి జెఇఇ మెయిన్ ర్యాంకులను సిబిఎస్‌ఇ, జెఇఇ మెయిన్స్ అపెక్స్ అథారిటీ ప్రకటించింది. మెయిన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. జాతీయ స్థాయిలోని తొలి 20 ర్యాంకుల్లో తెలంగాణలో చదివిన ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు స్థానం సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా గుంటూరుకు చెందిన తాళ్లూరి సాయి తేజ నిలిచాడు. ఐఐటి జెఇఇలో 345 మార్కులు సాధించడంతో పాటు ఇంటర్‌లో 986 మార్కులు సాధించడంతో ఆయనే టాపర్ అయ్యాడు. రెండో స్థానంలో 340 మార్కులు సాధించిన నెల్లూరు విద్యార్థి కె విఘ్నేష్‌రెడ్డి (ఇంటర్ 985), మూడో స్థానంలో ఐఐటి మెయిన్‌లో 335 మార్కులు సాధించిన అనంతపురానికి చెందిన సాయి ఆదిత్య సొంఠి (ఇంటర్ 982) మూడో స్థానంలో నిలిచాడు. 335 మార్కులతో ముల్లూరు ప్రశాంత్‌రెడ్డి (ఇంటర్ 977 మార్కులు) నాలుగో స్థానంలో 330 మార్కులతో ఎస్ సాయి ప్రణీత్‌రెడ్డి (ఇంటర్ 987) ఐదో స్థానంలో నిలిచారు.
34,781 సీట్లు
దేశవ్యాప్తంగా 92 విద్యాసంస్థల్లో 629 కోర్సులకు గానూ 34,781 సీట్లు ఉన్నాయి. 23 ఐఐటిల్లో 10,575, 31 ఎన్‌ఐటిల్లో 18,013 సీట్లు ఉన్నాయి. 18 జిఎఫ్‌టిఐలు, 20 ట్రిపుల్ ఐటిల్లో కూడా జెఇఇ ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్లు జరుపుతారు. ఐఐటిల్లో సీట్లు అడ్వాన్స్‌లో మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను జెఇఇ మెయిన్స్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
రాష్ట్రం నుండి మంచి స్కోర్ సాధించిన మరికొంత మందిలో సి లక్ష్మీనారాయణ (330), పి సాయి కిరణ్‌రెడ్డి (330), ర్యాలీ గాయత్రీ (330), పిజి పరిమళ (328), నర్రా సూరజ్ (326), గుండా నిఖిల్ సామ్రాట్ (326), దిగమర్తి చేతన్ సాయి (325), జె గోవర్ధన్ (325), రావి జయంత్‌రెడ్డి (325), పిజి జీవన్ చంద్ర (325), చింతాడ దుర్గా సాయి, ఈశ్వర సందీప్ (325), ఎస్ హర్షవర్ధన్ (319), ఎన్ సాయి తేజ (319) తదితరులున్నారు.