ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ కమిషనరేట్ ఉద్యోగులకు సాదర స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 23: హైదరాబాద్‌లోని సచివాలయ ఉద్యోగుల తరలింపు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం రాత్రి వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఉద్యోగులు గుంటూరుకు చేరుకున్నారు.
స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన కమిషనరేట్ కార్యాలయానికి రెండు బస్సులు, కార్లలో మినిస్టీరియల్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులు సుమారు 70 మందికి పైగా చేరుకున్నారు. ముందుగానే సమాచారం అందడంతో ఇక్కడి వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది సచివాలయ ఉద్యోగులకు సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, స్వీట్లు అందజేశారు. ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తమకు చెందిన సరంజామాతో పాటు వ్యవసాయ కమిషనరేట్‌కు సంబంధించిన పలు రకాల ఫైళ్లను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మినిస్టీరియల్ సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు కుటుంబ సభ్యులను వదిలివచ్చామని, బాధగా ఉన్నప్పటికీ విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
నాల్గవ తరగతి ఉద్యోగుల ఆవేదన
హైదరాబాద్‌లో పుట్టాం... అక్కడే పెరిగాం.. అక్కడే ఉద్యోగంలో నుంచి రిటైరై శేష జీవితాన్ని గడుపుదామనుకున్న తమకు రెండు ప్రభుత్వాలూ అన్యాయం చేశాయని, ఈ వయసులో అందరినీ వదులుకుని ఇక్కడికి రావడం చాలా బాధగా ఉందని కొందరు నాల్గవ తరగతి ఉద్యోగులు మీడియా ఎదుట కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపులో సచివాలయ వ్యవసాయశాఖలో తెలంగాణాకు చెందిన 24 మంది నాల్గవ తరగతి ఉద్యోగులను ఏపికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయమై పలుమార్లు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేసినా ఆందోళనలు, ధర్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. అయితే తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళన మేరకు అక్కడి సిఎం కెసిఆర్ తమ సమస్యను పరిష్కరించేందుకు సన్నద్ధమయ్యారని, ఈలోగా ఇక్కడకు తరలిరావాల్సి వచ్చిందని అన్నారు. తిరిగి తాము హైదరాబాద్ వెళ్లేందుకు రెండు ప్రభుత్వాలు కృషి చేయాల్సిందిగా నాల్గవ తరగతి ఉద్యోగులు ఎన్ రామచందర్, అరవింద్ తదితరులు విజ్ఞప్తిచేశారు.

చిత్రం హైదరాబాద్ నుంచి గుంటూరు చేరిన ఫైళ్లు.. మీడియా ముందు కంటతడి పెట్టుకున్న నాల్గవ తరగతి ఉద్యోగి రామచందర్