ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ-వైకాపా మధ్య వారథిలా ప్రశాంత్ కిషోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: బీజేపీ-వైకాపా మధ్య ప్రశాంత్ కిషోర్ వారథిలా మారారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బీజేపీ సమావేశంలో ప్రశాంత్ పాల్గొనడంతో 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టమైందని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో మునిగిన వైకాపాకు బీజేపీ దగ్గర కావడం నీతిబాహ్యమైన చర్యగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించి 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా కేంద్రం పరిగణలోకి తీసుకుందని గుర్తుచేశారు. కానీ కొన్ని పద్దుల నుంచి రెవిన్యూను కలపలేదని, అందువల్ల బేస్ ఇయర్ రెవిన్యూను సవరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖ రాశారు. 2015-16 సంవత్సరంలో ఫర్నేస్ ఆయిల్, ఎల్‌పీజీ, కిరోసిన్‌పై చమురు కంపెనీలు వ్యాట్, జీఎస్టీ చెల్లించాయని, ఆ మొత్తం 319 కోట్ల రూపాయలు ఉందని తెలిపారు. వీటిపై అంతర్రాష్ట అమ్మకాలకు సంబంధించి మరో 77.9 కోట్ల రూపాయలు రెవిన్యూలో కలపలేదని తెలిపారు. దీంతో బేస్ ఇయర్‌లో రెవిన్యూ 13,449 కోట్ల రూపాయలుగా మదింపు చేశారన్నారు. అదనంగా లెక్కించని రెవిన్యూను కలపడం వల్ల ఈ మొత్తం రూ. 13,876 కోట్లకు చేరుకుందని తెలిపారు. 2016-17 సంవత్సరానికి 14శాతం వృద్ధిరేటుతో రూ. 15,819 కోట్లు, 2017-18 సంవత్సరంలో 14శాతం వృద్ధిరేటుతో 18,033 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు రెవిన్యూ 15,002 కోట్ల రూపాయలు గా ఉంటుందని, ఈమేరకు సవరణలు జరిపి పరిహారాన్ని రాష్ట్రానికి చెల్లించాల్సిందిగా యనమల విజ్ఞప్తి చేశారు.