ఆంధ్రప్రదేశ్‌

ఆక్వాకు అంతంతమాత్రపు నిధులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగానికి ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులపై రైతులు, ఆక్వారంగ ప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. గత ఏడాది కంటే కేవలం మరో రూ.100 కోట్లు అదనంగా కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే వాదన వినిపిస్తోంది. గత బడ్జెట్‌లోఈ రంగానికి రూ.286 కోట్లు కేటాయించగా ఈసారి మరో వంద కోట్ల రూపాయలను అదనంగా అంటే రూ.386 కోట్లు కేటాయించారు. అయితే ఆక్వారంగానికి ఉన్న విస్తృత అవసరాల దృష్ట్యా ఈ మొత్తం ఏ మూలకు సరిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఆక్వా రంగం ద్వారా ఏపీ నుండి ఏటా సుమారు రూ.17వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. ఇంత కీలకమైన రంగంపట్ల ప్రభుత్వం కనపర్చాల్సినంత శ్రద్ధచూపడంలేదనేది రైతుల వాదన. ఆక్వా రంగంలోని ప్రధానంగా రొయ్యలదే ఆగ్రస్థానం. ఆ తర్వాత స్థానం చేపలది. అయితే రొయ్య విషయంలో ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అంత శ్రద్ద చూపించినట్లు కనిపించడంలేదు. రొయ్యల సాగులో అతిమఖ్యమైనది సీడ్. విదేశాల నుంచి రొయ్యల పిల్లలను తెచ్చుకోవడం చాలా ఖర్చుతో కూడిన పని. ఇందుకోసం ప్రభుత్వం ముందుకు వచ్చి ఎంపెడాతో చర్చించి ప్రభుత్వ హ్యాచరీలు ఏర్పాటుచేసి రైతులకు కావాల్సిన సంఖ్యలో సీడ్‌ను అందించాలి. ఇక చెరువులో వేసిన తర్వాత రొయ్యల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ఫీడ్‌ను అందించాలి. ఇందుకోసం ఫీడ్ మిల్లులను ఏర్పాటుచేసి, వ్యవసాయ రైతులకు ఇచ్చిన మాదిరిగా సబ్సీడీతో ఫీడ్‌ను అందించాలని రైతులు ఏనాటి నుంచో కోరుతున్నారు. అదేవిధంగా నిత్యం అప్రమత్తంగా ఉంటూ వైరస్‌ల బారి నుండి కాపాడుకోవడానికి అవసరమైన ల్యాబ్‌లు ఏర్పాటుచేయాల్సివుంది. చెరువుల్లో ఏర్పాటుకు అవసరమైన ఏరియేటర్ల సరఫరాతో పాటు పట్టిన రొయ్యను తరలించడానికి అవసరమైన నాణ్యమైన ఐస్ అందించడానికి ప్లాంట్లు నిర్మించాలి. అనంతరం కీలకమైన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటుచెయ్యాలి. ఇందుకు వందల కోట్ల రూపాయలు సరిపోవు. ఇక చేపల, పీతలు తదితరాల సాగుకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలి. అయితే ఎన్నడూలేని విధంగా ఈసారి బడ్జెట్‌లో ఆక్వా రైతులకు చాలా అత్యవసరమైన శీతల గిడ్డంగులను ఏర్పాటుచేయాలని నిర్ణయించడం కాస్త ఊరట కలిగిస్తున్న అంశమని చెప్పవచ్చు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రూ.65 కోట్లతో శీతల గిడ్డంగులను నిర్మించాలని నిర్ణయించడం రైతులకు ఎంతగానో ఉపకరించనుంది. అలాగే మత్స్యకార్మికుల సంక్షేమానికి నిధులుకేటాయించడం, 50 ఏళ్లు దాటిన మత్య్సకారులకు పింఛను ప్రకటన విశేషంగా చెప్పుకోవాలి. ఏదేమైనా బడ్జెట్‌లో ఆక్వా రంగానికి మరిన్ని కేటాయింపులు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.