ఆంధ్రప్రదేశ్‌

వెంకన్న పాదాల చెంత ఇచ్చిన మాట నిలుపుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 18: విభజన నేపథ్యంలో రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని సాక్షాత్తు తిరుమల శ్రీవేంకటేశ్వరుని పాదాల చెంత ఎన్నికల ప్రచారంలో నాడు ఇచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకుని అమలు చేయాలని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నల్లకోనకు చెందిన టీడీపీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చి మోదీ మాట తప్పారని ఈ అంశంపై రాష్టవ్య్రాప్తంగా నిరసనలు చేపట్టి ప్రజాచైతన్యం తీసుకురావడంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం తిరుపతి అలిపిరి వద్దనున్న గరుడ విగ్రహం నుంచి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీ పట్ల ఎంతో విశ్వాసంతో టీడీపీ అధినేత చంద్రబాబు గత నాలుగు సంవత్సరాలుగా కలసి ప్రయాణం చేశారన్నారు. మోదీ చెబుతున్నట్లు నమో అంటే నమ్మించి మోసం చేశారని ఆయనకు తగిన బుద్ధిని ప్రసాదించి రాష్ట్భ్రావృద్ధికి చేయూతనిచ్చేలా చేయాలని కోరుతూ ఈ ర్యాలీ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లావాసులు రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తారన్నారు. ఈసందర్భంగా యార్లగడ్డ శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా క్షమించరన్నారు. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. మోదీ ఏ స్వామి పాదాల చెంత మాట ఇచ్చారో, అక్కడే ఈ నిరసన ర్యాలీని ప్రారంభించాలని కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి తిరుపతికి వచ్చామన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరవేస్తున్న త్రివర్ణ పతాకం తెలుగువాడు రూపొందించిన విషయం మరిచిపోతున్నారని తెలుగువారికి అన్యాయం చేస్తే సహించేంది లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు సూరా సుధాకర్‌రెడ్డి, పుష్పావతి యాదవ్, దంపూరి భాస్కర్, డాక్టర్ సుధారాణి, కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు మధుసూదనరావు, కొక్కిలిగడ్డ ఆదాం, మల్లంపల్లి శివరామకృష్ణ, గురిపత్తి సుబ్బారావు, శ్రీనివాసులు, మాలింపాటి నితిన్, తిరుపతి నాయకులు పాల్గొన్నారు.