ఆంధ్రప్రదేశ్‌

ఉగాది వేడుకల్లో ప్రత్యేకాకర్షణగా దేవాన్ష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన వేడుకల్లో నారా దేవాన్ష్ సభలో ఉన్న కొద్దిసేపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌లతో కలిసి వచ్చారు. బాబు, దేవాన్ష్ సంప్రదాయబద్ధమైన తెల్ల దుస్తులు ధరించారు. బాబు దంపతులు తమ మనవణ్ని ఇద్దరి మధ్య సీటుపై కూర్చోబెట్టుకున్నారు. వేదిక పైనవారు ప్రసంగిస్తున్నా దేవాన్ష్ వారివైపు ఆసక్తిగా చూస్తూ ఆలకించడం సభికులను ముగ్దుల్ని చేసింది. ముందుగా అందరితో పాటు దేవాన్ష్ కూడా ఉగాది పచ్చడిని ఉత్సాహంగా రుచిచూసి పులుపు, చేదు తగలటంతో వదలిపెట్టేశాడు. ఈసందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, ఇతర దేశాలకన్నా మన కుటుంబ వ్యవస్థ ఆనందాన్నిస్తుందన్నారు. అందుకే అలాంటి వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. తమ మనవడు దేవాన్ష్ కూడా ఉగాది రోజే పుట్టాడని, అందుకే చిన్నప్పటి నుంచే మన సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించడానికి ఇలాంటి పండుగల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. సభ ప్రారంభమైన అరగంట తర్వాత భువనేశ్వరి, దేవాన్ష్ వేదిక దిగి వెళ్లిపోయారు.

చిత్రం..దేవాన్ష్‌కు ఉగాది పచ్చడి తినిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు