ఆంధ్రప్రదేశ్‌

సజావుగా పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు తావేలేదని, రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ కూడా ఇదే స్పష్టం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మసూద్ హుస్సేన్ అధ్యక్షతన నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను రెండ్రోజుల క్రితం పరిశీలించిందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో తాము పోలవరం పనులు పరిశీలించామని, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఎంతో ప్రగతి ఉందని ఆ కమిటీ చెప్పిందన్నారు. 3డీ నమూనా కూడా సిద్ధమైందని, త్వరలో మిగిలిన డిజైన్లకు సంబంధించి అనుమతులు మంజూరు చేస్తామని కమిటీ తెలిపిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఎలాంటి అవకతవకలకూ ఆస్కారం లేకుండా పారదర్శకతతో చేపడుతున్నామన్నారు. భూసేకరణకు నాబార్డు నుంచి నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ అవుతోందన్నారు. డయాఫ్రమ్ వాల్ పనులు మే నెలాఖరుకు పూర్తిచేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి రూ. 2,727 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. వచ్చే జూన్ మొదటి వారానికి గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందని, ఈలోగా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం వేచి చూడకుండా ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులు వెచ్చిస్తోందని మంత్రి ఉమా వివరించారు.