ఆంధ్రప్రదేశ్‌

వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని చెప్పలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 19: గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన సభలో వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, నేడు పెదవి విప్పకపోవడం 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమేనని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవాస్తవాలు చెపుతున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్‌సభలో రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. పలు కేసుల్లో ఎ-1, ఎ-2 నిందితులుగా ఉన్న జగన్మోహనరెడ్డి, విజయసాయిరెడ్డిలకు ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఇంటర్వ్యూలు ఇవ్వడం సరికాదని, దీనిద్వారా ప్రజలకు ఏం సంకేతాలు వెళుతున్నాయో కేంద్ర అధికారులు తెలుసుకోవాలన్నారు. కేసుల నుండి బయటపడేందుకే జగన్ బీజేపీతో మిలాఖత్ అయ్యారని ఆయన ఆరోపించారు. వైసీపీ అవిశ్వాసం అంటూ దొంగనాటకాలు ఆడుతోందని, ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం టీడీపీ 150 మంది ఎంపీల సంతకాలు సేకరించిందని, ఇది సమర్థుడైన చంద్రబాబుపై జాతీయంగా పార్టీల నాయకులకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న 19 అంశాల్లో ఏ ఒక్కటీ కేంద్రం అమలు చేయలేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 5 లక్షల కోట్లు అడిగారన్నారు. దేశంలోనే సుందరమైన రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పిన మోదీ కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఆర్థిక నేరస్థుల కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు చెప్పగా నాలుగేళ్లైనా కొన్ని కేసుల్లో పురోగతి లేదని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, పట్టిసీమలను అడ్డుకుంటూ జగన్ సైంధవుడి పాత్ర పోషిస్తున్నారన్నారు. బీజేపి ఎప్పటికీ టీడీపీకి పోటీకాదని, ఆ పార్టీ పతనానికి ప్రజలు నాంది పలకనున్నారన్నారు. లోక్‌సభలో అవిశ్వాసంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. అయితే బీజేపీ నాయకులు అడ్డుకుంటారేమోనని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.