ఆంధ్రప్రదేశ్‌

సంఘటితంగా పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: రాష్ట్ర ప్రజలు సంఘటిత శక్తిగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. ‘నాకు అండగా ఉండాలి, మీ సహకారం లభించాలి’ అని కోరారు. ‘మీ ఆశీస్సులతో ఎంతటి కార్యాన్నైనా సాధించే శక్తి నాకుంది. వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా పోరాటం చేసినప్పుడే ఫలితాలు సిద్ధిస్తాయి’ అని అన్నారు. ప్రతిఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. విజయవాడ నగరం నుంచి పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నాయకత్వంలో పెద్దసంఖ్యలో ముస్లింలు సోమవారం ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింల మనోభావాలు తనకు తెలుసన్నారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ముస్లింలకు సన్నిహితంగానే ఉందన్నారు. ముస్లిం హక్కులు కాపాడటంలో ముందుంటున్నామన్నారు. ముస్లింల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కేంద్రం సహకరిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుకు వెసులుబాటు కలుగుతుందన్నారు.
ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించేలా అల్లాను ప్రార్థించాలని కోరారు. మత సామరస్యం కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనన్నారు. ముస్లింల భాషా పరిరక్షణకు తమ ప్రభుత్వం నడుం బిగించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాఠశాల స్థాయి నుంచి రెండో మాతృభాషగా ఉర్దూను అమలు చేశామన్నారు. హైదరాబాద్‌లో హజ్ భవనం నిర్మించామన్నారు. హైదరాబాద్ నుంచి మక్కాకు నేరుగా విమానాలు నడిపించడంలో చొరవ తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ లేని పాలన అందించామన్నారు. షాదీఖానా, మసీదులకు ఆర్థిక సాయం అందించిన తొలి ప్రభుత్వం తమదేనని చెప్పారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత బస్సునే బస, కార్యాలయంగా చేసుకున్న స్థితి నుంచి అంచలంచెలుగా అభివృద్ధి బాటలు పరుస్తున్నామన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయమని అర్థిస్తుంటే, న్యాయం చేయమని కోరుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుండటాన్ని సహించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిపై విశ్వాసంతో లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాసం ఎలా ప్రకటిస్తారని వైసీపీని ఆయన ప్రశ్నించారు. కేంద్రం కూడా జగన్ అండ ఉంది కదాని తనను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఇన్నాళ్లూ ఎదురుచూసిన 5వ బడ్జెట్‌లో, చివరకు ఫైనాన్స్ బిల్లులోనూ రాష్ట్రానికి న్యాయం చేయకపోవడంతో కేంద్రంలోని తమ మంత్రులను రాజీనామా చేయించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగిందనే రాజీలేని పోరాటానికి సిద్ధమయ్యామన్నారు.
రాజ్యసభలో ఇచ్చిన హామీలను సమీక్ష చేయమని కోరిన తనపై విరుచుకుపడటం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం అన్యాయం చేసినా రాత్రింబవళ్లూ రాష్ట్భ్రావృద్ధికి కష్టపడుతున్నానన్నారు. సుపరిపాలన, ఆర్థిక సుస్థిరత కోసం పాటుపడ్డామన్నారు. ముస్లిం నేతలు రాష్టవ్య్రాప్తంగా తిరిగి ప్రస్తుత పరిస్థితులపై ప్రచారం చేయాలని చంద్రబాబు కోరారు.

చిత్రం..ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు