ఆంధ్రప్రదేశ్‌

బాలిబాలికలకు మెరుగైన భవితనిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: బాలబాలికలకు మెరుగైన భవితనిచ్చే బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. తరచుగా చట్ట సభల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ చర్చించడం ద్వారా బాలల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో బాలబాలికల సుస్థిరమైన అభివృద్ధికి 17 లక్ష్యాలు అనే అంశంపై మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. బాలబాలికల సమస్యల పరిష్కారానికి యూనిసెఫ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బాలికా విద్య అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కటే కృషిచేస్తే సరిపోదని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకారమందించాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల్లో స్నేహపూర్వక విద్యనందిస్తూ, లైంగిక వేధింపులు జరక్కుండా చూడాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం అన్ని పాఠశాలల్లోనూ కల్పించడం ద్వారా బాలికలను చదువుకు దూరం కాకుండా చూడొచ్చునని తెలిపారు. బాలబాలికలకు ఆరోగ్యం, పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే కాకుండా సమాజంలో ఉన్న అందరిపైనా ఉందన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఎంతో ముఖ్యమన్నారు. విద్యతోనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు. చిన్నారుల సమస్యలపై అన్ని వేదికలపైనా చర్చించడం ద్వారా వాటికి పరిష్కారం లభిస్తుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మాతా శిశువులకు, బాలబాలికలకు మెరుగైన స్థితిగతులు అందించడానికి ఒకరోజు శాసనసభలో చర్చిద్దామన్నారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో మాతా శిశు ఆరోగ్యంపై హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చేనెల 9వ తేదీ నుంచి 12 తేదీ వరకు నాలుగురోజుల పాటు ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నామని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు కిమిడి మృణాళిని, కిడారి సర్వేశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, స్ర్తి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సునీత ప్రసంగించారు.