ఆంధ్రప్రదేశ్‌

తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా తిరుమలేశుని దర్శనం కోసం మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. ఈసందర్భంగా సీఎంకు తిరుమల పద్మావతి అతిథి భవనం వద్ద టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, డిప్యూటీ ఈఓ బాలాజీ, ఓఎస్డీ లక్ష్మీనారాయణ స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. దేవాన్ష్ పుట్టిన రోజున కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకోవడం గత మూడేళ్లుగా పాటిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా మనవడు దేవాన్ష్‌తో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి దేవి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర మంగళవారం రాత్రి 7.28 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. అటు తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట ముఖ్యమంత్రి తనయుడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. అందరూ కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలసి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అనంతరం బయలుదేరి అమరావతికి వెళతారు.

చిత్రం..శ్రీవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుమలలో స్వాగతం పలుకుతున్న టీటీడీ ఇఓ సింఘాల్ తదితరులు