తెలంగాణ

వర్శిటీల్లో 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 21: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఐదుగురు సభ్యులతో గతంలో కమిటీని నియమించామన్నారు. ఆ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ సివి రాఘవులు, సభ్యులుగా ప్రొఫెసర్ సిఆర్ విశే్వశ్వరరావు, ఆర్ మాధవి, ఎ రామారావు, వి వెంకయ్యలు ఉన్నారన్నారు. ఆగస్టు 10వతేదీ 2015 నాటి ఉన్నత విద్యాసంస్థలు, నిర్వహణ సామర్థ్యం నియమావళి మేరకు రేషనలైజేషన్ విధానంలో పోస్టుల భర్తీకి కమిటీ సిఫార్సు చేసిందన్నారు. కమిటీ తమ పరిశీలనలో 1711 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి, వీటిలో 1385 పోస్టుల భర్తీకి సిఫార్సు చేసిందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 9నుండి 13వతేదీ వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌తో కలిపి 11 కేంద్రాల్లో ( అనంతపురం, గుంటూరు, హైదరాబాద్, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం) ఈ టెస్ట్ జరుగుతుందన్నారు. అభ్యర్ధులు తమ హాల్‌టికెట్‌లను మార్చి 25నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఒక్కొక్క పొస్టుకు సగటున 69మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం 1109 పోస్టులు భర్తీ రెండు దశలుగా భర్తీచేస్తామన్నారు. ఫేజ్-1లో 846 పోస్టులు, ఫేజ్-2లో 263పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. ఈస్క్రీనింగ్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తామన్నారు. ఎపీపీఎస్సీ ద్వారా టెస్ట్ నిర్వహించాలని వైస్‌ఛాన్సలర్ల సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ యూనివర్సిటీల పరిధిలో 76,356 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు ధరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందుల్లో జనరల్ అభ్యర్ధులకు 40శాతం, బిసిలకు 35శాతం, ఎస్‌సి, ఎస్‌టీలకు 30శాతం మార్కులను అర్హతగా నిర్ణయించినట్టు తెలిపారు. అర్హత సాధించిన వారికి ఇంటర్వూలు నిర్వహిస్తామన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తదితరులు పాల్గొన్నారు.