ఆంధ్రప్రదేశ్‌

గిరిజన తండాలన్నింటికీ లింక్ రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు సౌకర్యం లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు బుధవారం అసెంబ్లీలో తెలిపారు. ఇందుకోసం 90 శాతం ఉపాధి హామీ నిధులు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వినియోగిస్తున్నామన్నారు. అటవీ అనుమతులు లేని కారణంగా 151 పనులు ఆగి ఉన్నాయని, త్వరలో అనుమతులు తెచ్చి ఆ పనులు ప్రారంభిస్తామన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎస్టీ హోదాకు సంబంధించిన కేసులపై ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రశ్నపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చర్చలో పాల్గొంటూ వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనేతరులు భారీ సంఖ్యలో పాడేరు నియోజకవర్గానికి వస్తూ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, దీనిపై తాను ఫిర్యాదు చేసినా విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా జరుగుతున్నదంటూ మరికొంత మంది సభ్యులు జతకలిపారు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనంధబాబు చెప్పారు. దీనికి సంబంధించిన 245 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 500 మంది జనాభా కల్గిన గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటికీ మనం అమలు పరచకపోతే ఎలాఅని ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ప్రశ్నించారు. వెనుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల పరిధుల్లోని తండాలు ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లోని గిరిజన తండాలు ప్రత్యేక నిధులకు నోచుకోలేక అభివృద్ధి చెందటం లేదన్నారు. మంత్రి ఆనందబాబు బదులిస్తూ మైదాన ప్రాంతంలో 500 జనాభా కల్గిన 129 గ్రామాలను గుర్తించామన్నారు. అయితే వీటిని పంచాయతీలుగా మార్చాలంటే పాలనాపరంగా ఇబ్బందులున్నాయని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని అనేక గిరిజన తండాలకు లింక్ రోడ్లు లేక అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారంటూ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో మామిడికుదురు గ్రామాన్ని ఎస్టీ సమ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి చేయాలని కోరారు. రమణమూర్తి మాట్లాడుతూ పాత పట్నం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు బాగా వెనుకబడి ఉన్నాయని సరైన రోడ్డు సౌకర్యం లేదన్నారు. వంతల రాజేశ్వరి మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో చంద్రన్న బాటలో భాగంగా చాలా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు.