ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ విమానాశ్రయం నుంచి ఇకపై కార్గో సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 21: ఎయిర్ కార్గో సర్వీసులకు ఇక నుంచి విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) వేదిక కానుంది. ఇక్కడి నుంచి ఎగుమతి, దిగుమతులకు అనుమతి ఇస్తూ ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌తో ఎగుమతి, దిగుమతి కేంద్రంగా గన్నవరం విమానాశ్రయానికి ఎయిర్‌కార్గో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ విమానాశ్రయం ఎయిర్ కార్గో సర్వీసుగా గతంలో ప్రకటించారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌ను విజయవాడగా మార్చి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణాలో హైదరాబాద్‌ను చేర్చుతూ నోటిఫికేషన్ 61/94ను విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి ఇకపై ఎయిర్‌కార్గో ద్వారా ఏ దేశానికైనా వస్తువులు ఎగుమతి, దిగుమతి చేయవచ్చు. అయితే అవి రవాణా కావాలంటే ఫ్రైట్ ఛార్జీలతోపాటు కస్టమ్స్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందుకు ప్రత్యేక కస్టమ్స్ విభాగాన్ని కూడా కొద్దిరోజుల్లో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్నారు. తాజా నోటిఫికేషన్ వెలువడటంతో విమానాల రాకపోకల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. ఎగుమతి, దిగుమతుల డిమాండును బట్టి అంతర్జాతీయ సర్వీసులు నడువనున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉత్పత్తులకు ఎక్స్‌పోర్టు కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది. దేశంలో కొత్తగా విజయవాడ (గన్నవరం) ఎయిర్‌పోర్టు దేశంలో 33వ ఎయిర్‌కార్గోగా నమోదయింది. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి ఎయిర్ కార్గో సర్వీసులు నడుస్తున్నాయి.