ఆంధ్రప్రదేశ్‌

అవిశ్వాసం చర్చకు రాకుండా కేంద్రమే అడ్డుకుంటోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన బుధవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అవిశ్వాసంపై కావాలనే చర్చ జరుగకుండా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం సభ్యుని హక్కు అని, దానిపై చర్చ జరపడం స్పీకర్ బాధ్యత అని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసినట్లే, ఇప్పుడు బీజేపీ కూడా వ్యవహరిస్తోందన్నారు. వారికి కావాల్సిన బిల్లులను పార్లమెంట్‌లో గొడవ జరుగుతున్నా, ఆమోదింప చేసుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు అవిశ్వాసంపై కూడా చర్చకు అనుమతించవచ్చుగా అని ప్రశ్నించారు. అవిశ్వాసం పెట్టినంత మాత్రాన పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఆపడం కేంద్రం వల్ల కాదని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగానే పోలవరం పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. పోలవరం పనులు కేంద్రం కనుసన్నల్లో చేపడుతుంటే, ఇంకా ఏ విచారణ చేపడతారని ప్రశ్నించారు. పోలవరం పనులన్నీ పోలవరం అథారిటీ కింద జరుగుతున్నాయని వివరించారు. మమ్మల్ని స్కీమ్‌లు పెట్టవద్దని చెప్పడానికి వాళ్లేవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలకు ఏమి కావాలో వాళ్లను అడిగి ఇవ్వాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగ్ చెప్పిన ప్రకారం రెవెనూ లోటును భర్తీ చేయాలని, నీతి ఆయోగ్ కూడా రెవెన్యూ లోటుపై స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు.