ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ పెరిగేలా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: వేర్వేరు కారణాలతో ప్రస్తుతానికి ఏపీఎస్‌ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో చిక్కుకుని సతమతమవుతున్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ పెరిగేలా సంస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని డీజీగా పదోన్నతిపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్‌గా గురువారం నియమితులైన ఎన్‌వి సురేంద్రబాబు అన్నారు. తాను ఈనెల 26తేదీ పదవీ బాధ్యతలు చేపడతానని ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. గ్రామీణ ప్రజలు, విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచడమే కాకుండా ఉద్యోగ, కార్మికుల సహకారంతో నిర్ణీత సమయాల్లో తిరిగేలా ప్రయత్నిస్తానని అన్నారు. సురేంద్రబాబు 2001 నుండి 2004 వరకు విజయవాడ పోలీస్ కమినర్‌గా పనిచేశారు. ఆయన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా 2007లో పదోన్నతి పొందారు. 2006-2007 మధ్య కాలంలో హైదరాబాద్ సిటీ పోలీసు అడిషనల్ కమిషనర్‌గా కో ఆర్డినేషన్ విభాగంలో సేవలందించారు. ఆయన అంతకు ముందు హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేశారు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యపై మంచి అనుభవంతో తన సేవలనందించారు. ఆయన ప్రస్తుతం ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిజం ఫోర్స్) విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా తన సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి ఇస్తూ ఆయనను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చేశారు. వరంగల్‌లో ఎస్‌ఐటీ నుండి బిటెక్ డిగ్రీని, ముంబైలోని ఎస్‌ఐటిఐఇ నుండి ఎంటెక్ డిగ్రీని పొందారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ చేశారు. కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు గౌరవ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయనకు 2003లో రాజీవ్ సర్వీస్ మెడల్ లభించింది.