ఆంధ్రప్రదేశ్‌

ఉత్తర కుమారుడు పవన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ప్రత్యేక హోదా సాధనలో పొడిచేస్తానని బయల్దేరిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉత్తర కుమారుడిలా ఎందుకు తోకముడిచారో ప్రజలకు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసం పెడితే సంఖ్యాబలం కూడగడతానని ఘోషించిన పెద్దమనిషి, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి ఇప్పుడేమైపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే బాధగా ఉందని, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రవర్తనతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయన్నారు. ముఖ్యమంత్రిని బోనులో నిలబెడతానని వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ఎవరో చెప్పారంటూ సీఎంపై జనసేన అధినేత పవన్ అవినీతి బురద జల్లుతున్నాడని ఆరోపించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి లోకేష్ సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదో పవన్ చెప్పాలన్నారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు బయట, లోపలా ఆందోళన చేస్తున్నా స్పందించకుండా పవన్ ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతూ రాష్ట్ర అభివృద్ధికి సైంధవుడిలా దాపురించాడంటూ ధ్వజమెత్తారు. ప్రజలు వీరి తీరు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.