ఆంధ్రప్రదేశ్‌

పంట పొలాల్లో దిగిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 22: సాంకేతిక లోపంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో గురువారం ల్యాండైంది. ఈ హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్‌లోని బొకార్‌పూర్ నుంచి చెన్నైకు వెళ్తుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌లు గురుప్రీత్‌సింగ్, ప్రశాంత్, కిరణ్‌ఠాకూర్ అత్యవసరంగా ఇక్కడి పంట పొలాల్లో దించారు. పైలట్‌లు సాంకేతిక సమస్యను ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో విశాఖలోని ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక నిపుణులు సంఘటన స్థలానికి వచ్చి లోపాన్ని సరిదిద్దారు. ఊహించని రీతిలో పొలాల్లో హెలీకాప్టర్ దిగడంతో ఆశ్చర్యానికి గురైన పరిసర గ్రామాల ప్రజలు చూసేందుకు తండోపతండాలుగా ఇక్కడకు వచ్చారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దాక హెలికాప్టర్ తిరిగి బయలుదేరింది.