ఆంధ్రప్రదేశ్‌

గీతం డీమ్డ్ వర్శిటీకి అటానమీ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: ఉన్నత విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అటానమీ (స్వయం ప్రతిపత్తి) హోదా కల్పించడంతో పాటు కేటగిరి 1 విద్యా సంస్థగా గుర్తింపుఇచ్చిందని వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు తెలిపారు. గీతం దూరవిద్య కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూజీసీ దేశవ్యాప్తంగా 60 విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించగా డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో గీతం కళాశాల కేటగిరి 1 కింద స్వయం ప్రతిపత్తి హోదా పొందిందన్నారు. గీతం విశ్వవిద్యాలయం 2007లోనే డీమ్డ్ హోదాతో హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రాంగణాలను నెలకొల్పిందన్నారు. ప్రస్తుతం గీతం డీమ్డ్ వర్శిటీ మూడు ప్రాంగణాల్లో 12 ఇనిస్టిట్యూట్స్, 10 ఫ్యాకల్టీలు, 52 విభాగాలు, 10 రీసెర్చ్ సెంటర్లతో 190 యూజీ, పీజీ కోర్సులు నిర్వహిస్తోందన్నారు.
గీతం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, లా, మెడిసిన్, నర్శింగ్, అంతర్జాతీయ వాణిజ్యం, సైన్స్, సోషల్ సైన్స్, మేనేజ్‌మెంట్ కోర్సులో 21 వేల మందికి పైగా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారన్నారు. దూర విద్యావిధానం ద్వారా మరో 80వేల మంది విద్యార్థులు పలు కోర్సులు అభ్యసిస్తున్నారన్నారు. బార్క్, డీఆర్‌డీఓ, యూజీసీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో 150కిపైగా పరిశోధన ప్రాజెక్టులు నిర్వహణలో ఉన్నాయన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న ఉన్నత ప్రమాణాలను పరిశీలించిన నాక్ 2017 సంవత్సరంలో ఏ ప్లస్ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా గుర్తింపును ఇవ్వడం ద్వారా ప్రస్తుతం అటానమస్ హోదా పొందేందుకు దారితీసిందన్నారు.
గీతం యూనివర్శిటీకి స్వయంప్రతిపత్తి హోదాతో పాటు కేటగిరి 1 విద్యా సంస్థగా గుర్తింపును పొందడంతో కొత్త కోర్సుల ప్రవేశానికి శ్రీకారం చుట్టనున్నట్టు వీసీ ప్రసాదరావు వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ కోర్సులను 2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అటానమీ హోదాతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్తతరం నైపుణ్యతతో కూడిన కోర్సులను త్వరితగతిన ప్రారంభించేందుకు అవకాశమేర్పడుతుందన్నారు.
విదేశీ విద్యా సంస్థలకు చెందిన నిపుణులైన ఫ్యాకల్టీ సభ్యులను నియమించుకోవడం, పరిశోధన కేంద్రాలు, ఇంక్యుబేషన్ సెంటలను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. గీతం దూరవిద్యకు సంబంధించి నూతన కోర్సులను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే నెలకొల్పిన ఫిన్‌టెక్ అకాడెమీ, స్కూల్ ఆఫ్ గాంధీయన్ సెంటర్, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బయోసైనె్సస్ వంటివి మరింత ప్రాచుర్యం పొందగలవన్నారు. ప్రసిద్ధి చెందిన విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్త కోర్సుల నిర్వహణకు మార్గమేర్పడుతుందన్నారు. ర సమావేశంలో గీతం ప్రో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు తదితరులు పాల్గొన్నారు.