ఆంధ్రప్రదేశ్‌

ఆదాయమే పరమావధి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: అభివృద్ధికి ఆదాయమే పరమావధి కాదని, ధనిక, పేద అంతరాలు తొలగాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ దిశగా 2020 నాటికి కరవును అధిగమించి అంతరాలు తొలగింపజేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. శాసనసభలో శుక్రవారం సమ్మిళిత అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ కేవలం వస్తువుల కొనుగోలు, అమ్మకాలు వలన లభించే ఆదాయంతో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడదన్నారు. పేదల కొనుగోలు శక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సేవల రంగం ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టామని, సంక్షేమానికి 67 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. యువతకు వెయ్యి కోట్లతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధిని 11.2 శాతానికి పెంచామన్నారు. జల సంరక్షణలో భాగంగా నీరు-మీరు కార్యక్రమంతో వ్యవసాయాన్ని కొంతైనా లాభసాటిగా చేసి 13 జిల్లాల్లో గత ఖరీఫ్ సీజన్‌లో 159 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించామన్నారు. కరవును అధిగమించి ఉత్పత్తిని పెంచడంతో పాటు పేదరికాన్ని నియంత్రించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దేశం మొత్తం 6.6 శాతం మాత్రమే ఆర్థిక వృద్ధి నమోదైందని, రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చామన్నారు.