ఆంధ్రప్రదేశ్‌

వలస నేతల్లో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 24: సమయానుకూలంగా గెలిచే పార్టీల్లోకి ఫిరాయించే సీజనల్ నేతలకు ప్రస్తుతం గడ్డుకాలం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే మిగిలివుండటంతో ఈసారి కూడా పెద్దఎత్తున నేతలు పార్టీలు మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుత అయోమయ రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీలోవుంటే అధికారానికి దగ్గరగా ఉంటామనే విషయమై స్పష్టతలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలివుండంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు నేతలు ఇటీవల పార్టీలు మారడానికి రంగం సిద్ధంచేసుకున్నారు. ఈ జిల్లాలో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతలకు కొదవ లేదు. సమయానుకూలంగా ఏ పార్టీకి గెలిచే అవకాశాలుంటాయో, ఆయా పార్టీల పొత్తులు, అనుసరించే వ్యూహాలకు అనుగుణంగా ఇక్కడి నేతలు ఫిరాయింపులకు పాల్పడుతుంటారు. ప్రత్యేకించి కొందరు నేతల చరిత్రను తిరగేస్తే ప్రతిసారీ సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఫిరాయింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఎన్నికల సమయానికి ఏడాది ముందు ప్రారంభమై, ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ తరహా రాజకీయాలు పతాక స్థాయికి చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో ఆయా పార్టీల నుండి అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్లు ఆశిస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు, ఆశావహుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రస్తుతం నెలకొన్న అయోమయ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యం చేయలేక తమలో తాము నలిగిపోతున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ ఆయా రాజకీయ పార్టీల మధ్య సంబంధాలపై స్పష్టత లేకపోగా, ఏ పార్టీ ఎవరితో చెలిమి కడుతుందో అర్ధం కాని అయోమయ స్థితిలో సదరు నేతలున్నారు. కేంద్ర, రాష్టస్థ్రాయి నేతలకే ఈ విషయమై ఓ స్పష్టత లేకపోతే ఇక తమ పరిస్థితి ఏమిటని జిల్లాకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం విషయంలో తీసుకున్న యూ టర్న్ రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో మనిషన్న ప్రచారం జరిగింది. పవన్ తాజా ప్రకటనలతో ఆ విధంగా భావించిన వారందరి మబ్బులు విడిపోయాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ అవినీతిపై నేరుగా పవన్ విరుచుకుపడటం, అనంతరం జరిగిన పరిణామాలతో భవిష్యత్‌లో ఆయన తెలుగుదేశంతో కలిసే ప్రసక్తి లేదన్న విషయం స్పష్టమయ్యింది. అయితే పవన్ ఎవరితో జత కట్టే అవకాశముందన్న చర్చ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ బీజేపీతో వచ్చే ఎన్నికల్లో జత కడతారా? అన్న ప్రచారమూ జరుగుతోంది. పవన్ కేవలం తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడంతో ఆయన వైఖరి బీజేపీకి అనుకూలంగా ఉందన్న ప్రచారం గట్టిగా మొదలయ్యింది. నిన్న మొన్నటివరకు టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరగవచ్చన్న నమ్మకంతో ఉన్న నేతలకు ఈ పరిణామం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది.
ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమైన కొందరు నేతలు మళ్ళీ యూ టర్న్ తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ధీమాగా ఉన్నపుడు ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో టీడీపీ-బీజేపీ మధ్య మైత్రి చెడిపోవడం, రాజ్యసభ ఎన్నికల్లో సునీల్‌కు మూడవ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం చేజారిపోవడంతో ఆయన యూ టర్న్ తీసుకున్నట్టు తెలిసింది. అలాగే జిల్లాలో పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు సహా ఓ ఎంపీ వచ్చే ఎన్నికల్లో పార్టీలు మారే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ తరహా నేతలు టీడీపీ, వైసీపీ, బీజేపీల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయమై స్పష్టత ఇచ్చిన పక్షంలో ఫిరాయింపులకు సదరు నేతలు క్యూ కట్టే అవకాశాలుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.