ఆంధ్రప్రదేశ్‌

ఆకృతులు అదరహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 24: రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించే సచివాలయంతో పాటు ఇతర భవన నిర్మాణ ఆకృతులను అసెంబ్లీ ప్రాంగణంలో సందర్శనకు ఉంచారు. శనివారం మొదట శాసన మండలి ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన ఆకృతులను తరువాత అసెంబ్లీ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. నూతన సచివాలయ తుది ఆకృతులను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. పాలవాగుకు రెండు వైపులా సచివాలయం భవంతులు ఉండేటట్టుగా ఆకృతులను డిజైన్ చేశారు. మొత్తం ఐదు టవర్లుగా నిర్మించే ఈ సచివాలయంలో ఒక్కో టవర్ 40 అంతస్తులుగా ఉంటుంది. అన్ని టవర్లను కలుపుతూ 600 మీటర్ల మేర అంతర్గత మార్గం కూడా ఉండేటట్టుగా డిజైన్లను రూపొందించారు. ఇందులో సీఎంవో, సాధారణ పరిపాలనశాఖ ఒకే టవర్‌లో ఉండే విధంగా రూపొందించారు. అలాగే సీఎం టవర్ మాత్రం 46 అంతస్తులు, దాని పక్కనే సీఎస్ టవర్ ఉండే విధంగా రూపకల్పన చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రాకపోకలను నిర్వహించుకునేందుకు వీలుగా సీఎం టవర్‌పైనే హెలీప్యాడ్ ఉండే విధంగా డిజైన్‌ను తయారు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన ఈ ఆకృతులను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సందర్శంచి, పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొన్ని సూచనలను సలహాలను అందించారు. కార్యాలయ విధులకు అనుకూలంగా విశాలమైన స్థలం ఉండాలని సూచన చేశారు. రాజధాని ప్రాంతంలో ఈ తరహా భవన నిర్మాణం కారణంగా ఆర్థిక, సామాజిక, పాలనా వ్యవహాలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయన్నారు. అలాగే అసెంబ్లీ సందర్శనకు వచ్చిన సందర్శకులు ప్రజాప్రతినిధులకు కూడా ఆకృతల వివరాలను వివరించారు. భవన నిర్మాణ ఆకృతులను పరిశీలించిన నేతలు ఈ నిర్మాణాలు పూర్తియితే అమరావతి అందాలు మరింతగా శోభిల్లుతాయని అభిప్రాయపడ్డారు.

డిసెంబరు నాటికి కోటి కనెక్షన్లు
అమరావతి డిసెంబరు నెలాఖరులోపు రాష్ట్రంలో కోటి కనెక్షన్లు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థ అధికారులను ఆదేశించారు. ఏపీ ఫైబర్‌నెట్‌లో జరుగుతున్న ప్రగతిపై ముఖ్యమంత్రి శనివారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైబర్‌నెట్ కనెక్షన్లు ఇవ్వడంలో మరింత వేగం పెరగాలని, మే నెలాఖరులోపు పది లక్షల కనెక్షన్లు ఇవ్వాలని, డిసెంబరు నెలాఖరులోపు కోటి కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఈ ప్రకారం చేయాలంటే ప్రతి జిల్లాలో రోజుకు 3287 కనెక్షన్లు ఇచ్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు.