ఆంధ్రప్రదేశ్‌

అడుగడుగునా అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 24: తనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ముందు, తమ పార్టీ కార్యకర్తలు, మోదీ అభిమానులు, బీజేపీ సానుభూతిపరుల వల్ల గెలిచి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడుతో రాజీనామా చేయించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచించారు. గత ఎన్నికల్లో మా ఓట్లు కూడా టీడీపీకి పోలయినందువల్లే టీడీపీ గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలన అవినీతిమయమయిందని, దానిని పెకలించేందుకు గునపాలు సరిపోవని, బుల్డోజర్లు కావాలని విరుచుకుపడ్డారు. అమిత్‌షా రాసిన లేఖపై చర్చించేందుకు తాము సిద్ధమేనని, అవినీతి అంశాలపై చర్చించేందుకు టీడీపీ సిద్ధమేనా అని సవాల్ చేశారు. అసెంబ్లీ వేదికగా బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ఆ హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇరిగేషన్ కాంట్రాక్టర్లను తాము బెదిరిస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ, తామెవరినీ బెదిరించాల్సిన అవసరం లేదన్నారు. హోదాపై రోజుకోరకంగా మాట్లాడుతున్న టీడీపీని తెలుగు డ్రామాల పార్టీగా అభివర్ణించారు. రాష్ట్రంలో పట్టిసీమ ప్రాజెక్టు అవినీతికి పరాకాష్ఠగా మారిందని, ఆ ప్రాజెక్టుకు 1667 కోట్లు అవడంలో మర్మమేమటని, 3 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులకు 800 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలోప్రతి మండలానికి 5 కోట్ల కుంభకోణం జరిగిందని, నీరు-చెట్టులో యంత్రాలు ఉపయోగించి ప్రతిచోట్లా 4 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సర్వశిక్ష అభియాన్‌లోనూ అవినీతి జరిగిందని, అక్కడ ప్రతి నియామకం, ప్రతి కొనుగోలులోనూ అవినీతి కంపు కొడుతోందని, విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ సీఎంలా మారారని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నియంత్రిస్తోందని, కెనాల్ అండర్ టనె్నల్ నిర్మాణానికి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వేలకోట్లు అవినీతికి పాల్పడుతూ ప్రతివారం సోమవారం పోలవారం అంటున్నారని బాబుపై ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో ఎత్తిపోతలంటే ఎత్తివేయడమే. రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణంలో మంత్రులు దోచుకుంటున్నారు. భూమాతను టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారు. సర్వశిక్ష అభియాన్ అవినీతికి ఆలవాలంగా మారింద’ని విరుచుకుపడ్డారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ నేతలదేనని వీర్రాజు స్పష్టం చేశారు.