ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందర్భంగా విశ్వక్సేనుని పూజ నిర్వహిస్తున్న అర్చకులు
ఒంటిమిట్ట, మార్చి 24: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణతో వేద పండితులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవిరాట్‌లకు పంచామృత సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివార్లను పట్టుపీతాంబరాలతో అలంకరించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. సంప్రదాయం ప్రకారం విశ్వక్సేనుని ఆరాధన పూజలు జరిగాయి. శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆశీనులను చేయించారు. టీటీడీ సిబ్బంది మహాసంకల్పాన్ని చేయించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలకు సంప్రోక్షణ చేశారు. గణపతి పూజ, స్వస్తిపుణ్యవాచనం నిర్వహించారు. పుట్టబంగారాన్ని శాస్త్రోక్తంగా తీసుకువచ్చారు. యాగశాలలో కలశాల వద్ద పూజలు నిర్వహించారు. వేదపండితులు పుట్టబంగారాన్ని తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఒక పక్క వేదమంత్రోచ్చారణలు మిన్నంటగా కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మహాఘట్టం శోభాయమానంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో తొలిరోజు స్వామివారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామన నవమి సందర్భంగా స్వామి దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం మహాకవి బమ్మెర పోతనమాత్యుడి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
సంవత్సరంలోగా ఒంటిమిట్ల ఆలయం పూర్తిస్థాయిలో అభివృద్ధి
విజయవాడ: సంవత్సరంలోగా ఒంటిమిట్ల ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో శనివారం నాటి ప్రశ్నోత్తర సమయంలో శిథిలమైన ప్రాచీన దేవాలయాల పునర్మిణాన్ని టీటీడీ చేపడుతోందా అని పప్పల చలపతిరావు ప్రశ్నించగా, మంత్రి స్పందిస్తూ, భద్రాచలం తరహాలో పూర్తిస్థాయిలో ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.