ఆంధ్రప్రదేశ్‌

కాలపరిమితి ముగిశాకే వీఎంసీలో పంచాయితీల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: వివిధ పంచాయితీల కాలపరిమితి ముగిశాకే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో విలీనం ప్రక్రియ చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రాజేంద్ర ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, వీఎంసీలో 51 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదించామన్నారు. గన్నవరం, పెనమలూరు, విజయవాడ (రూరల్), ఇబ్రహీపట్నం మండలాల్లో ఈ పంచాయితీలు ఉన్నాయన్నారు. పంచాయితీల కాలపరిమతి ముగిశాకే, విలీనం చేస్తామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ముసాయిదా సిద్ధమైందన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో విలీనమైన, విస్తరించిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు.