ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా సాధనకు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధనకు తమ పార్టీ ఎంపీలతో కలిసి టిడిపి ఎంపీలు స్పీకర్ రాజీనామా లేఖలు సమర్పించేందుకు ముందుకు రావాలని వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. బిజెపి మంత్రులను కలవవద్దని బయటకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతన్నారని, కాని లోపల మాత్రం కేంద్ర మాజీ మంత్రులు సుజనా చౌదరిని, ఇతర ఎంపీలను కేంద్ర మంత్రులను కలవాలని కోరుతున్నారని ఆయన ఆరోపించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా విషయంలో ఎవరు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామన్నారు. అప్పుడే ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా డిమాండ్ దేశ వ్యాప్తంగా తెలుస్తుందన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద సోమవారం పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌తో ఎంపీలు సమావేశమవుతారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఏపికి అన్యాయం చేస్తుందో మొదటి నుంచి చెబుతున్నామన్నారు. నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని భావించడం మంచి పరిణామమన్నారు. నాలుగేళ్లుగా జగన్ ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోరాడుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిన్నటి దాకా బిజెపితో కలిసి చంద్రబాబు ప్రయాణం చేశారని, ఈ రోజు బయటకు వచ్చారని, దీని వెనక కారణాలను బహిర్గతం చేయాలన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.