ఆంధ్రప్రదేశ్‌

ఏపీ సమస్యలపై అవగాహన లేని అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 24: ఆంధ్రప్రదేశ్ సమస్యలపై అవగాహన లేకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానిస్తున్నారని ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అధికారులతో కనీస సమాచారం తీసుకోకుండా ఏవేవో ఆయన మాట్లాడటం తగదన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన సందర్భంలో శనివారం అసెంబ్లీ లాబీల్లో లోకేష్ విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందని, అభివృద్ధి ఎజెండాతో కాదని అమిత్‌షా అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్ని పనులకు సంబంధించిన యూసీ సర్ట్ఫికేట్లను కేంద్రానికి పంపుతున్నామని చెప్పిన ఆయన, అయినా యూసీ సర్ట్ఫికేట్‌కు ప్రత్యేక హోదాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని 18 హామీల అమలుకు యూసీ అవసరమా అని లోకేష్ అన్నారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆవేశంతో కూడినది కాదని స్పష్టం చేసిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రధాని దృష్టికి తెచ్చేందుకే కేంద్ర పదవులకు రాజీనామా చేశామన్నారు. అయినప్పటికీ టీడీపీ ఎన్డీఎలోనే కొనసాగిందని చెప్పిన ఆయన అలాంటిది మాది ఆవేశపూరిత నిర్ణయం ఎలా అవుతుందన్నారు. అమిత్‌షా చేసిన ఆరోపణలు అన్నింటికీ ఆధారాలతో సహా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకో లేఖ రాస్తారని తెలిపారు.