ఆంధ్రప్రదేశ్‌

ఫార్మా-డీ విద్యార్థుల గోడు పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ఆరేళ్ల పాటు, లక్షలాది రూపాయలు వెచ్చించి ఫార్మా-డీ కోర్సును పూర్తిచేసుకున్న వేలాది విద్యార్థులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో శనివారం సభ్యులు వి.ప్రభాకరచౌదరి, గద్దె రామ్మోహన్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభాకరచౌదరి అడిగిన ప్రశ్నకు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫార్మశీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ లిఖితపూర్వక సమాధానమివ్వగా పలువురు సభ్యులు అది సరైన సమాధానం కాదంటూ తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. తొలుత ప్రభాకర చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 58 ఫార్మా-డీ కళాశాలున్నాయని, వీటిలో చదివిన 3వేల మంది పట్ట్భద్రులు ఇప్పటికే ఉపాధి లేక వీధిన పడ్డారన్నారు. ప్రస్తుతం మరో 21వేల మంది చదువుతున్నారని రేపు వీరి పరిస్థితి కూడా ఇదేనని అన్నారు. దీనివల్ల యువత పెడదారి పట్టగలదన్నారు. పొరుగునున్న తమిళనాడులో ఈ కోర్సును టెక్నికల్ కోర్సుగా గుర్తించారని అన్నారు. ప్రధానంగా ఈ కోర్సును విద్యాశాఖ నుంచి తప్పించి వైద్యశాఖ పరిధిలోకి తీసుకురావాలన్నారు.
గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తొలి రోజుల్లో ఎంబిబిఎస్ కోర్సు అంతటి గిరాకీ ఉండేదన్నారు. డొనేషన్లు, ఫీజులు అదే విధంగా ఉండేవన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీరి సేవలను గుర్తించడం లేదన్నారు. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్ పరిశీలించే అవగాహన వీరికే ఉంటుందన్నారు. తక్షణం చట్టం చేసి అన్ని ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ చట్ట ప్రకారం 25 పడకలు దాటిన అన్ని ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్ ఉండాలన్నారు.