ఆంధ్రప్రదేశ్‌

2022 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి తాగునీటి సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం గ్రామీణ నీటి సరఫరాపై శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా మంత్రి లోకేష్ సమాధానమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్రంలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ నోడల్ ఏజెన్సీ పనిచేస్తోందన్నారు. సుస్థిర ప్రాతిపదికపై గ్రామంలోని ప్రతి వ్యక్తికి తాగునీరు, వంట ఇతర ప్రాథమిక అవసరాల కోసం తగినంత సురక్షిత నీటిని సమకూర్చడం లక్ష్యంగా తీసుకొని పనిచేస్తున్నామన్నారు. 2018 నాటికి, 35 శాతం కనీసం గృహ కనెక్షన్లు, 2022 నాటికి ప్రతి గ్రామీణ వ్యక్తి తమ ఇంటి నుండి 50 మీటర్లు మించని దూరంలో 70 ఎల్‌పీసీడీలు నీటిని ఇస్తామన్నారు. రూ.461,08 కోట్ల వ్యయంతో ఈ సంవత్సరం 1458 జనావాసాలను లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పనుల కార్యక్రమాల నిమిత్తం 2017-18 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.627.27 కోట్లను కేటాయించామన్నారు. 509 జనావాసాలకు తాగునీటి సౌకర్యాలను సమకూర్చడం కోసం 422 పనులకు నాబార్డ్ నుంచి రూ.125.36 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామన్నారు. ఎస్‌డీపీ సీఎం నిధి కింద 699 ఐటీడీఏ ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాల కోసం రూ.104.99 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్న ట్యాంకుల కోసం 723 పనులకు గాను రూ.28.43 కోట్లు కేటాయించామన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద సుమారు రూ.402.40 కోట్ల మొత్తంలో సుమారు 7787 ప్రాంతాలకు 103 క్లస్టర్లను గుర్తించామన్నారు. వాటి కోసం టెండర్లను ఆహ్వానించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 3230 తాగునీటి ప్రాంతాలను గుర్తించి, ప్రైవేట్ వనరులు అద్దెకు తీసుకున్నామన్నారు. నీటి కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసే ఆన్‌లైన్ ట్రాకింగ్, పర్యవేక్షణ వ్యవస్థ కోసం జీపీఎస్ ఆధారిత మొబైల్ యాప్‌ను అమలు చేస్తున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 1వ తేదీ నుండి 45 రోజులపాటు 2018 అత్యవసర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో ప్రతి తాగునీటి వనరుల వ్యవస్థను తనిఖీ చేసి, పరిశీలించి, చేతి పంపులకు సంబంధించి బాగుచేసే పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ
వేసవి దృష్ట్యా ప్రకాశం జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఉన్న దృష్ట్యా అదనపు సిబ్బందిని నియమించి ప్రతిరోజూ రియల్ టైంలో నీటి సమస్యలను పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశామని చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రకాశం జిల్లాకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులను కేటాయించామన్నారు. రాష్ట్రంలో రూ.22వేల కోట్లతో వాటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామన్నారు. రూ.99.32 కోట్లు గనుల శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా సంస్థకు నిధులు మరలించారన్నారు. బ్యాంకు రుణాలతో 8 జిల్లాలకు, యాన్యుటీ విధానంలో 7 జిల్లాలకు నీటి కొరతను శాశ్వతంగా దూరం చేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు.