ఆంధ్రప్రదేశ్‌

వివక్షపై విరుచుకుపడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్భ్రావృద్ధిలో కేంద్రం అనుసరిస్తోన్న వివక్షపై విరుచుకుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు 3వేల కోట్లు ఇచ్చి, ఏపీకి మొండిచేయి చూపిన పక్షపాతం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. శనివారం ఎంపీలు, మంత్రులతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఈ వారంలో పార్లమెంటుకు 5రోజులు సెలవులు. ఇంకా రెండురోజులే సభ జరుగుతుంది. మన పోరాటం మరింత ఉద్ధృతం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ప్రజల హక్కులు పరిరక్షించాలి. సభ లేనప్పుడు ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాలి. మన పోరాటం గురించి వివరించాలి. కేంద్రాన్ని మనం ఏం అడుగుతున్నాం? వాళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? మిగిలిన రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారు? అనే దానిపై ప్రజలను చైతన్యపరచాలి. ఒకవైపు మన రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు రూ.3వేల కోట్లు ఇచ్చారు. దీని సంకేతం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ అంటే అంత చిన్న చూపా? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి, మిగిలిన రాష్ట్రాలకు హోదా వల్ల వచ్చే ప్రోత్సాహకాలు కొనసాగిస్తున్నారు. ఏపీపై ఎందుకీ వివక్ష’ అని చంద్రబాబు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెడితే కేంద్రానికి ఎంతో లాభమనీ, జీఎస్‌టీ, ఐటీ రూపంలో ఆదాయం భారీగా కేంద్రమే పొందుతోందని, భారీగా ఆదాయం పొందుతూ కూడా రాష్ట్రాలపై కేంద్రం శీతకన్ను వేయడం దురదృష్టకరం. అభివృద్ధి మాది.. ఆదాయం మీదా అని కేంద్రాన్ని నిలదీశారు. ‘్భమి, నీళ్లు, కరెంటు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆదాయంలో అధిక భాగం పొందేది కేంద్రం. ఈ పరిస్థితులు మారాలి. కియా మోటార్స్‌తో కేంద్రానికి ఎంత ఆదాయం వస్తుంది? హీరో మోటార్స్‌తో కేంద్రానికి ఎంత ఆదాయం వస్తుంది? దీనికి ప్రతిగా రాష్ట్రాలను ఆదుకోవడంలో కేంద్రం ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. మన కష్టంతో వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధి సాధించామని, సగటున ఏడాదికి 10.5 శాతం వృద్ధి స్వయంకృషితో సాధిస్తున్నామన్నారు. నంద్యాల ఎన్నికల్లో ప్రజల్లో 58 శాతం సంతృప్తి ఉందని, ఈ నెలలో 63 శాతం సంతృప్తి ప్రజల్లో నెలకొందన్నారు. కేంద్రం అన్యాయంపై ఆందోళనలు చేపట్టడం వల్ల 73 శాతం సంతృప్తి వచ్చింది. త్వరలోనే 80 శాతం సంతృప్తిని చేరుకుంటామని అభివృద్ధి చెందే రాష్ట్రాలను బలహీనపరచరాదని, పురోగామి రాష్ట్రాలను నిరుత్సాహపరచరాదన్నారు.‘పీఎంవో చుట్టూ విజయసాయి ప్రదక్షిణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సుజనా చౌదరిపై దుష్ప్రచారం చేస్తున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం. ఇదంతా మీకు కంటగింపుగా ఉందా? మాపైనే ఆరోపణలు చేస్తారా?’ అని వైకాపాపై మండిపడ్డారు. ‘మరి విజయసాయి రెడ్డి పీఎంవోలో చేసిందేమిటి, మీడియా కంటబడకుండా ఎందుకు దాక్కున్నాడని ప్రశ్నించారు. మీలాగా మాకు లాలూచీ రాజకీయాలు తెలియవు, కేసుల మాఫీ అవసరం మీకుంది గాని మాకు లేదని’ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రుల భేటీకి యనమల
కాగా దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీపై యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. తనకు కేరళ ఆర్థిక మంత్రి ఫోన్ చేయడం గురించి వివరించారు. పథకాలకు కేంద్ర నిధుల మంజూరులో 2011 జనాభా ప్రామాణికతపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం గుర్తుచేశారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిరసన తెలిపిన సంగతి ప్రస్తావించారు. 1971 జనాభానే ప్రామాణికంగా తీసుకోవాలని గతంలోనే కోరిన విషయం ప్రస్తావించారు. 2011 జనాభాకు 10శాతం వెయిటేజి ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ పాటించినందుకు గతంలో ప్రోత్సాహకాలు ఉండేవి. అలాంటిది ఇప్పుడు జనాభా నియంత్రణ లేని రాష్ట్రాలకు అధిక నిధులా? దీనిపై దక్షిణాది ఆర్థిక మంత్రుల భేటీకి వెళ్లేందుకు సీఎంను అనుమతి కోరగా, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు.