ఆంధ్రప్రదేశ్‌

బాబూ.. ముస్లింల మద్దతు మీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 24: ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీ వర్గాల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. తాము బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం వర్గాలు రోడ్డెక్కి సంబరాలు చేసుకున్నారు. బాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా అభినందించారు. తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు బాబును సచివాలయంలో కలిసి ముస్లిం వర్గాల మద్దతు మీకే ఉంటుందని భరోసా ఇచ్చారు. దానికి స్పందించిన బాబు తాను తొలి నుంచి మైనార్టీలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. తానెప్పుడూ ఇతర పార్టీల మాదిరిగా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం ముస్లింలు తన వెంట నడవాలని, అన్ని మతాలు, కులాలు కలిసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని కోరారు. తొలుత సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ముస్లిం పెద్దలు ఆశీర్వదించి బాగ్దాద్ నుంచి పెద్ద గురువు పంపిన చాదర్‌ను చంద్రబాబుకు బహూకరించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన చాదర్‌ను అజ్మీర్‌లో ఖాజా మొయినుద్దీన్ దర్గాకు చంద్రబాబు బహూకరించారు. ఈ సందర్భంగా అజ్మీర్‌లో ఉరుసుకు వెళుతున్న ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలని మతపెద్దలు ప్రార్థించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఎంహెచ్ రహమాన్, ఎస్‌ఎం పెజాన్, ఎండీ బేగ్, ఎండీ సయ్యద్ మబూద్, అస్గర్ షరీఫ్, ఎస్‌కె అమానుల్లా, ఎస్‌ఎం జావెద్, కరీముల్లా, ముఫ్తి తదితరులు ఉన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాదర్ బహూకరించిన ముస్లిం పెద్దలు